MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇంగ్లాండ్‌కి భారీ షాక్... టీ20 వరల్డ్‌కప్, యాషెస్ సిరీస్ నుంచి జోఫ్రా ఆర్చర్ అవుట్...

ఇంగ్లాండ్‌కి భారీ షాక్... టీ20 వరల్డ్‌కప్, యాషెస్ సిరీస్ నుంచి జోఫ్రా ఆర్చర్ అవుట్...

ప్రస్తుతం ఇండియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. కొన్నాళ్లుగా గాయంతో బాధపడుతున్న ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, ఈ ఏడాది మొత్తం క్రికెట్‌కి దూరం కాబోతున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 05 2021, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొన్న జోఫ్రా ఆర్చర్, కుడి ఎడమ చేతి గాయం కారణంగా వన్డే సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రెండు నెలల విరామం తర్వాత కోలుకుని, ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. అయితే గాయం తిరగబెట్టడంతో మళ్లీ క్రికెట్‌కి దూరమైన జోఫ్రా ఆర్చర్, టీమిండియాతో జరిగే టెస్టు సిరీస్‌లో రీఎంట్రీ ఇస్తాడని భావించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

37

అయితే అతని మోచేతికి అయిన గాయం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తేల్చారు. దీంతో ఈ ఏడాది మొత్తం క్రికెట్‌కి దూరంగా ఉండబోతున్నాడు జోఫ్రా ఆర్చర్...

47

ఐపీఎల్ 2021 సీజన్‌తో పాటు ఆ తర్వాత జరిగే టీ20 వరల్డ్‌కప్, ఆ తర్వాత జరిగే ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్‌కి కూడా జోఫ్రా ఆర్చర్ దూరంగా ఉంటాడని తెలిపింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

57

సౌతాఫ్రికా టూర్‌లో గాయపడిన జోఫ్రా ఆర్చర్, ఆ తర్వాత సరైన క్రికెట్ ఆడలేకపోయాడు. ఈ ఏడాది మార్చి నెలలో అతని వేలి నుంచి ఓ గాజు ముక్కను వెలికి తీసిన వైద్యులు, మళ్లీ మే నెలలో శస్త్ర చికిత్స జరిపారు... 

67

మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడడం వల్ల ఆర్చర్ మోచేతికి గాయం కాగా, తన ఇంట్లో ఫిష్ బాల్‌ కిందపడినప్పుడు తన వేలికి గాయమై, ఓ గాజు ముక్క లోపలే ఉండిపోయినట్టు సమాచారం...

77

టెస్టులతో పాటు టీ20ల్లో ఆల్‌రౌండర్‌గా అదరగొట్టే జోఫ్రా ఆర్చర్... టీ20 వరల్డ్‌కప్‌లో అందుబాటులో లేకపోవడం ఇంగ్లాండ్‌కి గట్టి దెబ్బే కానుంది... తన కెరీర్లో 12 టెస్టులు, 17 వన్డేలు, 12 టీ20 మ్యాచులు ఆడిన జోఫ్రా ఆర్చర్ మొత్తంగా 86 వికెట్లు పడగొట్టాడు.
 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
India Test Captains Records: శ్రీలంకలో భారత టెస్టు కెప్టెన్ల రికార్డులు.. నంబర్ 1 ఎవరో తెలుసా?
Recommended image2
Indian Cricket: మ్యాచ్ లేకపోతే డ్యూటీకే.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టాప్ టీమిండియా స్టార్స్ వీరే
Recommended image3
Ishan Kishan: బ్యాంకు ఉద్యోగిగా మారిన టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్.. నెలకు జీతం ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved