MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • INDvsENG 4th Test: ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఆధిక్యం దిశగా సాగుతున్న ఆతిథ్య జట్టు...

INDvsENG 4th Test: ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఆధిక్యం దిశగా సాగుతున్న ఆతిథ్య జట్టు...

నాలుగో టెస్టు ఇంగ్లాండ్ జట్టు రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 52 పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్. అయితే ఓల్లీ పోప్, జానీ బెయిర్‌స్టో క్రీజులో కుదురుకుపోవడంతో ఇంగ్లాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 03 2021, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఓవర్‌నైట్ స్కోరు 53/3 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు, అదే స్కోరు వద్ద నైట్‌ వాచ్‌మెన్ క్రాగ్ ఓవర్టన్ వికెట్ కోల్పోయింది...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

12 బంతుల్లో ఒకే పరుగు చేసిన ఓవర్టన్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఉమేశ్ యాదవ్‌కి ఇది టెస్టుల్లో 150వ వికెట్...

36

టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆరో పేసర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఉమేశ్ యాదవ్. ఉమేశ్ యాదవ్ కంటే ముందు కపిల్‌దేవ్ 434, జహీర్ ఖాన్ 311, ఇషాంత్ శర్మ 311, జవగళ్ శ్రీనాథ్ 236, మహ్మద్ షమీ 195 వికెట్లతో టాప్‌లో ఉన్నారు...

46

67 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేసిన డేవిడ్ మలాన్ కూడా ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లోనే రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 62 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

56

అయితే కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్‌ను ఓల్లీ పోప్, బెయిర్ స్టో కలిసి ఆదుకున్నారు. వరుసగా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.

66

ఓల్లీ పోప్ 66 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు, జానీ బెయిర్‌స్టో 63 బంతుల్లో 7 ఫోర్లతో 34 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి 109 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Cricket : ఐపీఎల్ సానబెట్టిన యంగ్ టాలెంట్స్.. టీమిండియా తలుపు తట్టే టాప్ 5 ప్లేయర్స్ వీళ్లేనా..?
Recommended image2
SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ కు బ్యాడ్ న్యూస్.. ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనా? ఓటమికి కారణాలివే
Recommended image3
GT vs SRH: పూర్తిగా చేతులెత్తేసిన స‌న్‌రైజ‌ర్స్‌.. గుజ‌రాత్ దెబ్బకు చిత్తు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved