టీమిండియా ఫైనల్‌కి వెళ్తుంది, కానీ మళ్లీ మేమే గెలుస్తాం... ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ మొదలైనప్పుడు స్టేడియంలో జనాలు పెద్దగా లేకపోయినా, సాయంత్రానికి చూసేందుకు వచ్చిన జనాల సంఖ్య భారీగా పెరిగింది.
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సెమీస్ చేరే నాలుగు జట్లు ఏవి? దీనికి క్రికెట్ విమర్శకులు,మాజీ క్రికెటర్లు అందరూ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండియాలో జరిగే ప్రపంచ కప్ కావడంతో భారత జట్టు కచ్ఛితంగా సెమీస్ చేరుతుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..
ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, తాజాగా దీనిపై స్పందించాడు. ‘నా ఉద్దేశంలో ఇంగ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్ చేరతాయి..
సౌతాఫ్రికాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వాళ్లు ఎలా కమ్‌బ్యాక్ ఇచ్చి సిరీస్ గెలిచారో చూశాంగా.. వాళ్ల బ్యాటింగ్ బలంగా ఉంది, బౌలింగ్ యూనిట్ కూడా చాలా బాగుంది..
Pakistan team
పాకిస్తాన్‌కి కూడా మంచి టీమ్ ఉంది. న్యూజిలాండ్ కూడా బలంగానే ఉంది. అయితే నా ఉద్దేశంలో ఈ రెండు జట్లు సెమీస్ చేరలేవు... వాళ్ల టీమ్స్‌లో ప్రపంచ కప్ గెలిచేందుకు కావాల్సిన ఎక్స్-ఫ్యాక్టర్ మిస్సింగ్...
వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో టీమిండియా ఓడిపోతుందని అనిపిస్తుంది. భారత్ పోటీ ఇచ్చినా, టైటిల్ గెలవలేదు.. ఈసారి కూడా ప్రపంచ కప్ మాదే’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్..