రోహిత్ ‘డబుల్’ సెలబ్రేషన్స్... రితికా- రోహిత్ శర్మ పెళ్లిరోజునే వన్డేల్లో త్రిబుల్ డబుల్...
First Published Dec 13, 2020, 11:37 AM IST
ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో రోహిత్ శర్మకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. భారత సారథి విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే, మాస్ జనాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. తెలుగు జీన్స్ కలిసిన రోహిత్ శర్మకు ఈరోజు (డిసెంబర్ 13) చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఐదేళ్ల క్రితం ఇదే రోజున రితికా సగ్దేని పెళ్లాడాడు రోహిత్. అంతేకాదు వన్డేల్లో త్రిబుల్ డబుల్ సెంచరీ బాదింది కూడా నేడే.

స్పోర్ట్స్ మేనేజర్‌గా వ్యవహారిస్తున్న రితికాకి, రోహిత్ శర్మకు పెళ్లికి ఆరేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అంతకుముందు విరాట్ కోహ్లీకి కూడా మేనేజర్‌గా వ్యవహారించింది రితికా...

యువరాజ్ సింగ్‌కి రాఖీ కడుతూ అన్నయ్య అని పిలిచేది రితికా. అలా రితికాపై రోహిత్ శర్మకు మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. అది స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?