- Home
- Sports
- Cricket
- కుల్దీప్ నాకు సారీ చెప్పడం కాదు.. మీరు ఇంకెప్పుడు ఆడతారు..? ఢిల్లీ ఆటగాళ్లకు పాంటింగ్ క్లాస్
కుల్దీప్ నాకు సారీ చెప్పడం కాదు.. మీరు ఇంకెప్పుడు ఆడతారు..? ఢిల్లీ ఆటగాళ్లకు పాంటింగ్ క్లాస్
IPL 2023: ఐపీఎల్ -16లో వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓడి ఇంకా బోణీ కొట్టని ఢిల్లీ క్యాపిటల్స్ రాను రాను ప్లేఆఫ్ ఆశలను క్రమంగా కోల్పోతోంది.

ఐపీఎల్ - 2023 ఎడిషన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర నుంచి ఇంకా బయటపడలేదు. ఇటీవలే ఆర్సీబీతో మ్యాచ్ లో ఓడిన ఢిల్లీ.. వరుసగా ఐదో ఓటమిని నమోదుచేసింది. ఈ నేపథ్యంలో అసలు టీమ్ కు హెడ్ కోచ్ గా ఉన్న రికీ పాంటింగ్, మెంటార్ సౌరవ్ గంగూలీలు ఏం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Image credit: Delhi Capitals
వీరేంద్ర సెహ్వాగ్ వంటి క్రికెటర్లు అయితే గతంలో ఢిల్లీ ఫైనల్ కు వెళ్లినప్పుడు తర్వాత రెండు సీజన్లు ప్లేఆఫ్స్ దాకా వెళ్తే క్రెడిట్ కొట్టేసిన రికీ పాంటింగ్ ఓటములకు కూడా బాధ్యత వహించాలని బహిరంగంగానే విమర్శలు చేశాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా పాంటింగ్, గంగూలీలపై కాస్త ఘాటుగానే స్పందించాడు.
Image credit: Delhi Capitals
కాగా ఆరర్పీబీతో మ్యాచ్ ముగిశాక ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్ లో రికీ పాంటింగ్ ఆ జట్టు ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ ఓడిన తర్వాత తనకు సారీ చెప్పిన కుల్దీప్ ను అలా ఎప్పటికీ చెప్పొద్దని అన్నాడు. తనకు కావాల్సింది సారీ కాదని, ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసి మ్యాచ్ లు గెలవడమని అన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన వీడియోలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ... ‘ఇది నిజంగా మంచి బౌలింగ్ ప్రదర్శన. వాళ్లు (ఆర్సీబీ) మనను ముందుగానే సవాల్ చేశారు. మన అటిట్యూడ్, కమిట్‌మెంట్ తిరిగొచ్చింది. కుల్దీప్.. నువ్వు ఎక్కడ..? ఓడిపోయినందుకు బాధగా ఉందా..? మ్యాచ్ అయిపోయాక నువ్వు నా దగ్గరకి వచ్చి సారీ చెప్పావు.
కానీ కుల్దీప్ నీకు ఓ విషయం చెబుతున్నా. నాకే కాదు. క్రికెట్ ఫీల్డ్ లో జరిగేదానికి గాను ఇంకెవరకీ ఎప్పుడూ సారీ చెప్పకు. నాకు కావాల్సింది మీ సారీలు కాదు. మీరు మళ్లీ పుంజుకోవాలి. మ్యాచ్ లు గెలవాలి. వాస్తవానికి ఆర్సీబీ తో మ్యాచ్ లో నువ్వు రెండు వికెట్లు తీశావ్. మంచి బౌలింగ్ ప్రదర్శన అది. లలిత్ యాదవ్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ పరంగా కూడా రాణించాడు..’అని అన్నాడు.
ఇక టీమ్ మెంటార్ గంగూలీ మాట్లాడుతూ.. ‘ఈ ఓటములను మీరు మరిచిపోండి. ఇవన్నీ ఆటలో భాగం. మీరు కలిసికట్టుగా ఆడండి. వచ్చే మ్యాచ్ ను ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. మనకు ఇంకా 9 గేమ్స్ ఉన్నాయి. మనం వాటిలో గెలుస్తామా..? లేదా..?గెలిస్తే ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అవుతామా..? అన్నది పక్కనబెట్డండి. మనకోసం ఆడండి. మీకు వార్నర్ వంటి స్ట్రాంగ్ ప్లేయర్ సారథిగా ఉన్నాడు. ఒక్క మ్యాచ్ లో గెలిస్తే మళ్లీ మనం పుంజుకుంటాం..’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.