- Home
- Sports
- Cricket
- Shikhar Dhawan: సెంచరీ మిస్ అయినందుకు బాధగానే ఉంది.. కానీ.. : గబ్బర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Shikhar Dhawan: సెంచరీ మిస్ అయినందుకు బాధగానే ఉంది.. కానీ.. : గబ్బర్ ఆసక్తికర వ్యాఖ్యలు
WI vs IND ODI: విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు తొలి వన్డేను విజయంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్ లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్.. తృటిలో శతకం చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

వెస్టిండీస్ తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో భారత జట్టు సమిష్టిగా రాణించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు శుభమన్ గిల్, శిఖర్ ధావన్ లు అదిరిపోయే ఆరంభాలిచ్చారు.
18 నెలల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న శుభమన్ గిల్.. 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేయగా తాత్కాలిక సారథి శిఖర్ ధావన్.. 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 97 రన్స్ చేశాడు. 3 పరుగుల తేడాతో ధావన్ సెంచరీ మిస్ అయింది.
Shikhar Dhawan
అయితే సెంచరీ కోల్పోయినందుకు తానూ బాధపడినట్టు ధావన్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ధావన్ మాట్లాడుతూ.. ‘సెంచరీ చేజారినందుకు నాక్కూడా కాస్త బాధగానే ఉంది. కానీ ఈ మ్యాచ్ లో జట్టుగా మా ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నా. మేము తొలుత బ్యాటింగ్ చేసి మంచి స్కోరు సాధించాం.
Image credit: Getty
కానీ మ్యాచ్ చివర్లో ఇంత ఉత్కంఠగా మారుతుందని అస్సలు ఊహించలేదు. అయితే మేం మాత్రం ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా ఆడాం. ఫైన్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ ను వెనక్కి జరపడం ద్వారా మేము అనుకున్నది సాధించాం...’ అని తెలిపాడు.
ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ తో సిరీస్ లో విఫలమైన ధావన్ ఫామ్ పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అతడు తొలి వన్డేకు ముందు తాను విమర్శలను పట్టించుకోనని, తన పని తాను చేసుకుపోతానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Image credit: Getty
ఇక ఈ మ్యాచ్ లో విండీస్ లక్ష్య ఛేదనలో చివరి ఓవర్ల్ లో 14 పరగులు అవసరముండగా మహ్మద్ సిరాజ్ 11 పరుగులే ఇచ్చి మూడు పరుగుల తేడాతో భారత్ కు విజయాన్ని అందించాడు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. సిరీస్ లో రెండో వన్డే ఆదివారం జరగాల్సి ఉంది.