- Home
- Sports
- Cricket
- కెప్టెన్ గా చేశారు సరే.. కానీ అతడు ఇంకెంతకాలం ఆడగలడు..? హిట్ మ్యాన్ పై దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్
కెప్టెన్ గా చేశారు సరే.. కానీ అతడు ఇంకెంతకాలం ఆడగలడు..? హిట్ మ్యాన్ పై దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్
Dinesh Karthik Comments On Rohit Sharma: టీమిండియా నయా సారథి హిట్ మ్యాన్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే, టీ20లలో అతడి సారథ్యాన్ని ప్రశ్నించేవారెవరూ లేకపోయినా టెస్టులలో మాత్రం...

మూడు ఫార్మాట్లలో టీమిండియాను నడిపించనున్న రోహిత్ శర్మ సారథ్యంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వన్డే, టీ20లలో అతడి కెప్టెన్సీ స్కిల్స్ ను ప్రశ్నించేవారు లేకపోయినా.. టెస్టులలో మాత్రం అందుకు విరుద్ధంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయమై ఇప్పటికే పలువురు సీనియర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా స్పందించాడు.
ఇప్పటికే 34 ఏండ్లు ఉన్న రోహిత్ శర్మ.. ఇంకెంతకాలం క్రికెట్ ఆడతాడని కార్తీక్ ప్రశ్నించాడు. రోహిత్ తన అద్భుత వ్యూహాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నా.. టెస్టులలో మాత్రం కష్టమే అని చెప్పకనే చెప్పాడు.
కార్తీక్ స్పందిస్తూ... ‘రోహిత్ చాలా తెలివైన కెప్టెన్. అతడు మూడు ఫార్మాట్ లలో కూడా అద్భుతంగా రాణించగలడు. ఇక అతడిప్పుడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో రోహిత్ ఏడాది మొత్తం క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. ఇది హిట్ మ్యాన్ కు సవాలే..
అతడు క్వాలిటీ కెప్టెన్. అందులో అసలు సందేహమే అవసరం లేదు. ఇక వ్యూహాల విషయానికొస్తే గత మ్యాచు (వెస్టిండీస్ తో ముగిసిన ఆఖరు టీ20) లో మనం చూశాం. బౌలర్లను మార్చుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో హిట్ మ్యాన్ దిట్ట.
అయితే రోహిత్ కు ఇప్పటికే 34 ఏండ్లు. అతడు ఇంకా ఎంతకాలం క్రికెట్ ఆడుతాడన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న..’ అని కార్తీక్ అన్నాడు.
కార్తీక్ మాదిరే సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు. రోహిత్ కెప్టెన్సీ స్కిల్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకునేది లేకపోయినా అతడి వయసు ఏ మేరకు సహకరిస్తుందన్నదే అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న..