MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • హైదరాబాద్‌లో ధోనీ బర్త్ డే సెలబ్రేషన్స్... ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో 52 అడుగుల భారీ కటౌట్‌తో పాటు..

హైదరాబాద్‌లో ధోనీ బర్త్ డే సెలబ్రేషన్స్... ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో 52 అడుగుల భారీ కటౌట్‌తో పాటు..

మాస్ ఫాలోయింగ్ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీ రేంజ్ వేరు. సినిమా హీరోలకు తగ్గని స్థాయిలో యూత్‌లో ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్నాడు మాహీ. ఐపీఎల్ 2023 సీజన్‌లో సీఎస్‌కే ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ధోనీ మానియా కనిపించింది.. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 06 2023, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చెన్నై సూపర్ కింగ్స్‌ ఎక్కడ మ్యాచులు ఆడినా స్టేడియాలు అన్నీ మాహీ ఫాలోవర్లతో, సీఎస్‌కే సపోర్టర్లతో పసుపు వర్ణంతో నిండిపోయాయి.  ఇంతకుముందు ఎప్పుడూ సీఎస్‌కేకి ఈ రేంజ్ సపోర్ట్ దక్కలేదు. ధోనీకి 2023 సీజన్ ఆఖరి ఐపీఎల్ అనే ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణం..

26

జూలై 7న మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు. మాహీ బర్త్ డే కోసం హైదరాబాద్ ఫ్యాన్స్ వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో దేవీ థియేటర్ దగ్గర మహేంద్ర సింగ్ ధోనీకి 52 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్.. రేపు ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరపబోతున్నారు..
 

36


మహేంద్ర సింగ్ ధోనీ ఆడిన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌లు, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులను అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ధోనీకి హైదరాబాద్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండడంతో హౌజ్ ఫుల్ కావడం గ్యారెంటీ..
 

46
Dhoni-Rohit

Dhoni-Rohit

ఇంతకుముందు రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35MM థియేటర్ ముందు 60 అడుగుల భారీ కటౌట్ పెట్టారు ఫ్యాన్స్.

56

సైజు దృష్ట్యా ధోనీ కటౌట్‌, రోహిత్ శర్మ కటౌట్ కంటే 8 అడుగులు చిన్నది. అయితే థియేటర్‌లో ధోనీ ఇన్నింగ్స్‌లతో స్పెషల్ షోస్ వేయాలని నిర్ణయం తీసుకోవడం మాత్రం మాహీ ఫ్యాన్స్‌కే చెల్లింది..

66

కెప్టెన్‌గా 2007 టీ20 వరల్డ్ కప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2024 ఐపీఎల్‌లో ధోనీ ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు.. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : పాకిస్థాన్ పనైపోయింది.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్
Recommended image2
Dasun Shanaka : దసున్ షనక ఊచకోత.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన లంక కెప్టెన్
Recommended image3
PAK vs SL : పిచ్చెక్కించిన షనక.. వణికిపోయిన షాహీన్ అఫ్రిది.. గెలిచినా ఏడ్చిన పాక్ ప్లేయర్లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved