MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పాకిస్తాన్ ను చెడుగుడాడుకున్న టీమిండియా స్టార్ దీప్తిశర్మ

పాకిస్తాన్ ను చెడుగుడాడుకున్న టీమిండియా స్టార్ దీప్తిశర్మ

India vs Pakistan : మహిళల ఆసియా కప్ 2024 రెండో మ్యాచ్ లో దాయాది దేశాలైన భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. దీప్తి శర్మ సూపర్ బౌలింగ్ తో అదరగొట్టారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 19 2024, 10:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Deepti Sharma, India Women Cricket Team

Deepti Sharma, India Women Cricket Team

India women vs Pakistan Women : మహిళల ఆసియా కప్ 2024లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భార‌త్ విజయం సాధించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

శ్రీలంక‌లోని దంబుల్లా స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. షెఫాలీ వర్మ, స్మృతి మంధానలు ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టారు. హాఫ్ సెంచ‌రీల‌ను కోల్పోయారు కానీ, భార‌త్ కు మంచి విజ‌యాన్ని అందించారు. 

36

షెఫాలీ వర్మ, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 85 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మంధాన 31 బంతుల్లో 9 ఫోర్లతో 45 పరుగులు చేసింది. ఆమె పదో ఓవర్లో సయ్యదా అరుబ్ షా  బౌలింగ్ లో ఔట్ అయింది. 29 బంతుల్లో 40 పరుగులు చేసిన షెఫాలీని 12వ ఓవర్‌లో సయ్యదా బౌల్డ్ చేశారు. త‌న ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టింది షెఫాలీ. 

46

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 5 పరుగులతో, జెమిమా రోడ్రిగ్స్ 3 పరుగులతో నాటౌట్‌గా భార‌త్ ను విజ‌యం వైపు న‌డిపించారు. అంతకుముందు పాక్‌ ఇన్నింగ్స్‌ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. పాక్ ప్లేయ‌ర్ల‌లో సిద్రా అమీన్ 35 బంతుల్లో మూడు ఫోర్లతో 25 పరుగులతో టాప్ స్కోర‌ర్ గా ఉన్నారు. 

56
Deepti Sharma

Deepti Sharma

భార‌త్ అద్భుత‌మైన బౌలింగ్ ముందు పాక్ టీమ్ లోని ఏడుగురు ప్లేయ‌ర్లు రెండంకెల స్కోరు సాధించ‌లేక‌పోయారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ జట్టును దీప్తి శ‌ర్మ అద్భుత‌మైన బౌలింగ్ తో దెబ్బ‌కొట్టారు. కీల‌క‌మైన పాక్ కెప్టెన్ నిదా దార్, తుబా హసన్, నష్రా సంధుల వికెట్ల‌ను తీసుకున్నారు. ఓకే ఓవ‌ర్ లో కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి మూడు వికెట్లు ప‌డగొట్టింది. 

 

66

దీప్తి శ‌ర్మ‌కు తోడుగా మిగ‌తా బౌల‌ర్లు కూడా మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో పాకిస్తాన్ పెద్ద స్కోర్ చేయ‌లేక‌పోయింది. దీప్తి శ‌ర్మ 3 వికెట్లు తీసుకున్నారు. అలాగే,  రేణుకా సింగ్ 2, పూజా వస్త్రాకర్ 2,  శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. సూప‌ర్ బౌలింగ్ వేసిన దీప్తి శ‌ర్మ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. కాగా, ఈ టోర్నీలో భారత్‌ ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో రెండో మ్యాచ్ ఆడ‌నుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
RCB vs GT : నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ బాస్.. ప్లేఆఫ్స్‌లో రజత్ పాటీదార్ ఊచకోత చూశారా !
Recommended image2
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సిస్టర్‌పై దారుణమైన ట్రోలింగ్.. శ్రేష్ఠ ఘాటు రియాక్షన్.. ఏం జరిగిందంటే?
Recommended image3
IPL 2026 Eliminator: నో రిజర్వ్ డే.. ఎలిమినేటర్ మ్యాచ్ వర్షంతో రద్దయితే SRH పరిస్థితి ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved