MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • దీపక్ చాహార్ పెళ్లికి పాక్ పేసర్ హసన్ ఆలీ!? మన క్రికెటర్‌కీ, పాక్ క్రికెటర్‌కి తేడా తెలియట్లేదా...

దీపక్ చాహార్ పెళ్లికి పాక్ పేసర్ హసన్ ఆలీ!? మన క్రికెటర్‌కీ, పాక్ క్రికెటర్‌కి తేడా తెలియట్లేదా...

భారత ఆల్‌రౌండర్ దీపక్ చాహార్, తన ప్రేయసి జయ భరద్వాజ్‌ని పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆగ్రాలో బంధుమిత్రుల మధ్య వివాహం చేసుకున్న దీపక్ చాహార్, ఢిల్లీలో టీమ్ మేట్స్‌ సహా మిగిలినవారికి రిసెప్షన్ పార్టీ ఇచ్చాడు... ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 06 2022, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దీపక్ చాహార్ రిసెప్షన్‌కి భారత మాజీ కెప్టెన్లు ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ సకుటుంబ సమేతంగా హాజరవుతారని ప్రచారం జరిగినా...ఈ ముగ్గురూ ఈ వేడుకల్లో కనిపించలేదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 11 సీజన్లు ఆడిన ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా మాత్రం దీపక్ చాహార్ పెళ్లికి కుటుంబ సమేతంగా హాజరయ్యి, నూతన వధూవరులను ఆశీర్వదించాడు..

37

అయితే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ఎంపికైన రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్ వంటి క్రికెటర్లు... దీపక్ చాహార్ వేడుకకు హాజరయ్యారు...

47

అయితే భారత క్రికెటర్లతో కలిసి దిగిన ఫోటోల్లో పాక్ క్రికెటర్ హసన్ ఆలీ ఎందుకు ఉన్నాడని, అతన్ని ఎవరు పిలిచారని కొందరు కామెంట్లు చేశారు... దీనికి కారణం లేకపోలేదు...

57

అర్ష్‌దీప్ సింగ్, రవి భిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, కర్ణ్ శర్మ, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్‌తో పాటు భారత యంగ్ పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు.. అయితే ఖలీల్ అహ్మద్ గెటప్ చూడడానికి కాస్త హసన్ ఆలీలా కనిపించడంతో ఈ విధంగా కామెంట్లు చేశారు కొందరు నెటిజన్లు...

67

భారత క్రికెటర్‌కీ, పాక్ క్రికెటర్‌కీ మధ్య తేడా తెలియడం లేదా... ముస్లిం అయినంత మాత్రం పొరుగు దేశం వాడేనంటూ ఇలా ట్రోల్స్ చేస్తారా? అంటూ ఖలీల్ అహ్మద్‌ ట్రోలింగ్‌ని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్తున్నారు మరికొందరు నెటిజన్లు... 

77

గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు దీపక్ చాహార్. మెగా వేలంలో రూ.14 కోట్లకు దీపక్ చాహార్‌ని కొనుగోలు చేసిన సీఎస్‌కే, అతని గైర్హజరీలో 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది..

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved