DCvsSRH: సన్‌రైజర్స్ వర్సెస్ క్యాపిటల్స్... హెడ్ టు హెడ్ రికార్డులు...
IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచిన ఢిల్లీ టాప్‌లో ఉండగా, రెండు మ్యాచుల్లోనూ ఓడిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇప్పటిదాకా 15 సార్లు తలబడ్డాయి.
9 మ్యాచుల్లో హైదరాబాద్‌కి విజయం దక్కగా, ఆరు మ్యాచుల్లో ఢిల్లీకి విజయం వరించింది.
ఢిల్లీపై హైదరాబాద్ అత్యధిక స్కోరు 191 పరుగులు...
హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన అత్యధిక స్కోరు 189 పరుగులు...
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై హైదరాబాద్ చేసిన అత్యల్ప స్కోరు 116 పరుగులు...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ 80 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ మూడు సార్లు తలబడగా రెండు సార్లు ఢిల్లీ విజయం సాధించింది.
2019 ఫ్లేఆఫ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ నాలుగో స్థానంలో సరిపెట్టుకోగా, ఢిల్లీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ సీజన్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో విఫలమవుతున్న వార్నర్ సేన... తొలి విజయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది.
మరోవైపు అన్ని విభాగాల్లో అదరగొడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది.