CSKvsRCB: రవీంద్ర జడేజా సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్...
IPL 2021: సున్నా పరుగుల దగ్గర రవీంద్ర జడేజా ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచిన ఆర్‌సీబీ, ఆ క్యాచ్ డ్రాప్‌కి భారీ మూల్యం చెల్లించుకుంది. 19 ఓవర్లు ముగిసేసరికి 154 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్... మహా అయితే 170 పరుగులు చేస్తుందని అనుకున్నారంతా. అయితే ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు, ఓ ఫోర్ బాదిన రవీంద్ర జడేజా... చెన్నై సూపర్ కింగ్స్‌కి 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోరు అందించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఫాప్ డుప్లిసిస్ కలిసి మొదటి వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం అందించారు...

25 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో జెమ్మీసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

వస్తూనే బౌండరీల మోత మోగించడం మొదలెట్టిన సురేశ్ రైనా 18 బంతుల్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 24 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

సురేశ్ రైనా అవుటై తర్వాతి బంతికే డుప్లిసిస్ వికెట్ తీశాడు హర్షల్ పటేల్. 41 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన డుప్లిసిస్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆర్‌సీబీ ఫీల్డర్లు చేసిన తప్పిదాలు కలిసొచ్చాయి. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో జడేజా ఇచ్చిన క్యాచ్‌ను క్రిస్టియన్ జారవిడిచాడు...

7 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన అంబటి రాయుడిని కూడా అవుట్ చేసిన హర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు, ఫోర్‌తో చెలరేగిన రవీంద్ర జడేజా ఏకంగా 37 పరుగులు రాబట్టాడు.

28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసిన రవీంద్ర జడేజా... సునామీ ఇన్నింగ్స్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.