MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్‌లో టాప్-5 వికెట్ల వీరుడు.. అశ్విన్ మరో రికార్డు !

ఐపీఎల్‌లో టాప్-5 వికెట్ల వీరుడు.. అశ్విన్ మరో రికార్డు !

IPL Top 5 Wicket Takers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రవిచంద్రన్ అశ్విన్ టాప్-5 వికెట్లు తీసిన ప్లేయర్‌గా ఎదిగాడు.

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 29 2025, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులోకి రవిచంద్రన్ అశ్విన్ చేరాడు. భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో సునీల్ నరైన్‌ను అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన 5వ‌ బౌలర్‌గా ఘ‌న‌త సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో దేవదత్ పాడిక్కల్‌ను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. ఈ వికెట్ తో ఐపీఎల్‌లో అశ్విన్ 181 వికెట్ల న‌రైన్ ను అధిగ‌మించాడు.

24

అశ్విన్ ఇప్పటివరకు 214 మ్యాచ్‌లు ఆడి 182 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 182 వికెట్ల రికార్డును కూడా అతను సమం చేశాడు. అశ్విన్ బౌలింగ్ సగటు 29.79 కాగా, 7.13 ఎకానమీతో బౌలింగ్ వేశాడు.  2010, 2011 లో సీఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలవడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. తమిళనాడుకు చెందిన ఈ స్పిన్నర్ 10 సంవత్సరాల తర్వాత మ‌ళ్లీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.9.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లోకి తిరిగి వచ్చాడు.

 

34

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు వీరు:యుజ్వేంద్ర చాహల్: 161 మ్యాచ్‌లలో 205 వికెట్లు
పియూష్ చావ్లా: 192 మ్యాచ్‌లలో 192 వికెట్లు
డ్వేన్ బ్రావో: 161 మ్యాచ్‌లలో 183 వికెట్లు
భువనేశ్వర్ కుమార్: 177 మ్యాచ్‌లలో 182 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్: 214 మ్యాచ్‌లలో 182 వికెట్లు

44

అశ్విన్ అపార అనుభవం సీఎస్కే జట్టుకు చాలా ముఖ్యమైనది. స్పిన్ భాగస్వామిగా ఉన్న రవీంద్ర జడేజాతో తిరిగి కలవడం జట్టుకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది.  ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఎనిమిదో మ్యాచ్ లో అశ్విన్ ఈ ఘనత సాధించాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
GT vs RR : ఉత్కంఠ పోరులో రాజస్దాన్ దే గెలుపు... పోరాడిఓడిన గుజరాత్
Recommended image2
DC vs MI : ముంబై ఇండియన్స్ ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే..!
Recommended image3
IPL 2026 : 210 రన్స్ ఛేజింగ్.. పంజాబ్ కింగ్స్ సృష్టించిన వరల్డ్ రికార్డులు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved