MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• CSKvsKKR: చెన్నై హ్యాట్రిక్ విజయం... రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్ అద్వితీయ పోరాటం...

CSKvsKKR: చెన్నై హ్యాట్రిక్ విజయం... రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్ అద్వితీయ పోరాటం...

31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కేకేఆర్... ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈజీగా గెలుస్తుందని భావించారంతా. అయితే ఆండ్రూ రస్సెల్, దినేశ్ కార్తీక్, ప్యాట్ కమ్మిన్స్ అద్వితీయ పోరాటంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్... చివరి ఓవర్ దాకా విజయం కోసం పోరాడింది. కనీసం 100 అయినా కొట్టగలరా? అనుకున్న జట్టు, 202 పరుగులు చేసి, 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

2 Min read
Chinthakindhi Ramu
Published : Apr 21 2021, 11:27 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి దీపక్ చాహార్ కోలుకోలేని దెబ్బ తీశాడు. శుబ్‌మన్ గిల్, తాను ఎదుర్కొన్న మొదటి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి, ఇంగిడికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది కోల్‌కత్తా...

212

ఆ తర్వాత 12 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన నితీశ్ రాణా కూడా దీపక్ చాహార్ బౌలింగ్‌లోనే ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 17 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది కేకేఆర్.

312

ఇయాన్ మోర్గాన్ 7 బంతుల్లో 7 పరుగులు చేసి, సునీల్ నరైన్ 3 బంతుల్లో 4 పరుగులు చేసి... దీపక్ చాహార్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యారు. మరోసారి నాలుగు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు దీపక్ చాహార్.

412

సునీల్ నరైన్ అవుటైన తర్వాతి ఓవర్‌లోనే 9 బంతుల్లో 8 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, ఇంగిడి బౌలింగ్‌లో అవుట్ కావడంతో 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

512

ఈ దశలో ఆండ్రూ రస్సెల్, దినేశ్ కార్తీక్ కలిసి కేకేఆర్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. త్రిపాఠి అవుటైన తర్వాత వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాది 14 పరుగులు రాబట్టాడు రస్సెల్..

612

శార్దూల్ ఠాకూర్ వేసిన 10వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 24 పరుగులు రాబట్టిన ఆండ్రూ రస్సెల్, జడేజా బౌలింగ్‌లో సిక్సర్ బాది 21 బంతుల్లో మెరుపు హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

712

దినేశ్ కార్తీక్‌తో కలిసి 36 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి డేంజరస్‌గా మారుతున్న రస్సెల్‌‌ను సామ్ కుర్రాన్ అవుట్ చేశాడు. కుర్రాన్ బౌలింగ్‌లో వైడ్‌ అనుకుని రస్సెల్ వదిలేసిన బంతి వెళ్లి వికెట్లను గిరాటేసింది.

812

22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54 పరుగులు చేసి, సీఎస్‌కే శిబిరంలో గుబులు రేపిన రస్సెల్ అవుటైన తర్వాత 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్ కూడా ఇంగిడి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

912

అయితే ప్యాట్ కమ్మిన్స్, సామ్ కుర్రాన్ వేసిన 16వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 30 పరుగులు రాబట్టాడు. దీంతో కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 45 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది...

1012

అయితే ఆ తర్వాతి ఓవర్‌లో ఇంగిడి బౌలింగ్‌లో నాగర్‌కోటీ డకౌట్ అయ్యాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ప్యాట్ కమ్మిన్స్...  బ్యాటింగ్ ఆర్డర్‌లో 8వ స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ బాదిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకుముందు హర్భజన్ సింగ్, క్రిస్ మోరిస్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

1112

19వ ఓవర్ రెండో బంతికి సిక్సర్ బాదిన ప్యాట్ కమ్మిన్స్, 10 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన స్థితికి తేగా, ఆ తర్వాతి బంతికి వరుణ్ చక్రవర్తి రనౌట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సిన దశలో ప్రసిద్ధ్ కృష్ణ రనౌట్ కావడంతో 202 పరుగులకే ఆలౌట్ అయ్యింది కేకేఆర్...

1212

34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్ నాటౌట్‌గా నిలిచాడు. టాపార్డర్‌లో ఏ ఒక్కరు కనీసం 20 పరుగులు చేసి ఉన్నా, కేకేఆర్‌కి విజయం దక్కి ఉండేది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
Recommended image2
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన
Recommended image3
హమ్మయ్యా.! పదేళ్లలో వెయ్యి పరుగులు.. టీ20ల్లో శాంసన్ రేర్ రికార్డు..
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved