MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • క్రికెట్ లవర్స్‌కి 2025 బ్యాడ్ ఇయ‌ర్ అనే చెప్పాలి.. ఎందుకంటే.?

క్రికెట్ లవర్స్‌కి 2025 బ్యాడ్ ఇయ‌ర్ అనే చెప్పాలి.. ఎందుకంటే.?

Cricketers Retired in 2025: 2025 సంవత్సరం క్రికెట్ అభిమానులకు వీడ్కోలు సీజన్‌గా మారింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 20 మంది ప్రముఖ క్రికెటర్లు రిటైర్‌మెంట్ ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉండ‌డం గ‌మ‌నార్హం. 

2 Min read
Narender Vaitla
Published : Aug 29 2025, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
2025 బ్యాడ్ ఇయర్
Image Credit : Getty

2025 బ్యాడ్ ఇయర్

2025 క్రికెట్ లవర్స్ కి బ్యాడ్ ఇయర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలోని చాలా దేశాల్లోని క్రికెట్ టీమ్ లలో ప్రధాన ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇందులో ఎక్కువ మంది భారతీయ ప్లేయర్స్ కావడం గమనార్హం. ఇంతకీ ఏ దేశంలో ఏ ప్లేయర్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు పదవి విరమణ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

29
న్యూజిలాండ్
Image Credit : Getty

న్యూజిలాండ్

మార్టిన్ గప్టిల్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్

జనవరి 8, 2025న న్యూజిలాండ్ పవర్‌హిట్టర్ మార్టిన్ గప్టిల్ అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయ్యారు. 13 ఏళ్ల కెరీర్‌లో 47 టెస్టులు, 198 వన్డేలు, 122 T20లు ఆడారు.

Related Articles

Related image1
ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త భ‌విష్య‌త్తు మార‌డం ఖాయం.. రూ. 50 వేల కోట్ల‌తో భారీ పెట్టుబ‌డి
Related image2
భారీ వర్షాలతో అతలాకుతలం.. ఆదివారం వరకు స్కూళ్లకు సెలవులు.
39
బంగ్లాదేశ్
Image Credit : ANI

బంగ్లాదేశ్

తమీమ్ ఇక్బాల్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్

తమీమ్ ఇక్బాల్ జనవరిలోనే అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయ్యారు. ఇంతకుముందు 2023లో కూడా రిటైర్ అయ్యారు కానీ ఆ దేశ‌ ప్రధాని అభ్యర్థనపై తిరిగి వచ్చారు.

ముష్ఫికూర్ రహీమ్ – వన్డేలకు గుడ్‌బై

2025 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మార్చి 5న రహీమ్ వన్డేలకు రిటైర్ అయ్యారు. 274 వన్డేల్లో 7795 పరుగులు సాధించారు.

49
భారత్
Image Credit : Getty

భారత్

వరుణ్ ఆరన్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్

జనవరి 10న వరుణ్ ఆరన్ క్రికెట్ మొత్తానికి వీడ్కోలు పలికారు. 18 మ్యాచ్‌లలో 29 వికెట్లు తీశారు.

రిద్దిమాన్ సాహా – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్

ఫిబ్రవరి 3న సాహా రిటైర్ అయ్యారు. 40 టెస్టుల్లో 1353 పరుగులు, 9 వన్డేల్లో 41 పరుగులు చేశారు.

రోహిత్ శర్మ – టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 67 టెస్టుల్లో 4301 పరుగులు, 12 శతకాలు, ఒక డబుల్ సెంచరీ చేశారు.

విరాట్ కోహ్లీ – టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్

మే 12, 2025న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. 123 టెస్టుల్లో 9230 పరుగులు చేశారు.

పీయూష్ చావ్లా – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్

జూన్ 6న చావ్లా రిటైర్ అయ్యారు. కెరీర్‌లో మొత్తం 82 వికెట్లు తీశారు.

చేతేశ్వర్ పూజారా – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్

ఆగస్టు 24న పూజారా రిటైర్ అయ్యారు. 103 టెస్టుల్లో 7195 పరుగులు చేశారు. ఇందులో 19 శతకాలు, 35 అర్ధశతకాలు ఉన్నాయి.

రవిచంద్రన్ అశ్విన్ – IPL నుంచి రిటైర్

ఆగస్టు 27, 2025న అశ్విన్ IPL నుంచి రిటైర్ అయ్యారు. 187 వికెట్లు తీసుకున్నారు. ఇంతకు ముందు డిసెంబర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పారు.

59
ఆఫ్గనిస్తాన్
Image Credit : our own

ఆఫ్గనిస్తాన్

షాపూర్ జద్రాన్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్

జనవరిలో షాపూర్ జద్రాన్ సోషల్ మీడియాలో రిటైర్‌మెంట్ ప్రకటించారు.

69
శ్రీలంక
Image Credit : Getty

శ్రీలంక

దిముత్ కరుణారత్నె – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్

ఫిబ్రవరి 4న ఆస్ట్రేలియాతో 100వ టెస్ట్ ఆడిన తర్వాత కరుణారత్నె రిటైర్ అయ్యారు.

అంజెలో మాథ్యూస్ – టెస్టులకు గుడ్‌బై

జూన్‌లో మాథ్యూస్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. 119 టెస్టుల్లో 8214 పరుగులు చేశారు.

79
ఆస్ట్రేలియా
Image Credit : Getty

ఆస్ట్రేలియా

మార్కస్ స్టోయినిస్ – వన్డేలకు రిటైర్

ఫిబ్రవరి 6న స్టోయినిస్ వన్డేల నుంచి రిటైర్ అయ్యారు. 71 మ్యాచ్‌లలో 1495 పరుగులు చేశారు.

స్టీవ్ స్మిత్ – వన్డేలకు గుడ్‌బై

మార్చిలో స్మిత్ వన్డేల నుంచి రిటైర్ అయ్యారు. 170 మ్యాచ్‌లలో 5800 పరుగులు చేశారు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ – వన్డేలకు రిటైర్

జూన్‌లో మ్యాక్స్‌వెల్ వన్డేల నుంచి రిటైర్ అయ్యారు. 149 మ్యాచ్‌లలో 3990 పరుగులు చేశారు.

89
సౌతాఫ్రికా
Image Credit : Asianet News

సౌతాఫ్రికా

హెన్రిక్ క్లాసెన్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్

జూన్ 2న క్లాసెన్ రిటైర్ అయ్యారు. 4 టెస్టులు, 60 వన్డేలు, 58 T20లు ఆడారు.

99
వెస్టిండీస్
Image Credit : ANI

వెస్టిండీస్

నికోలస్ పూరన్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్

జూన్ 9న పూరన్ రిటైర్ అయ్యారు. 61 వన్డేల్లో 1983 పరుగులు, 106 T20ల్లో 2275 పరుగులు చేశారు.

ఆండ్రే రస్సెల్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్

జూలైలో రస్సెల్ రిటైర్ అయ్యారు. 1 టెస్ట్, 56 వన్డేలు, 84 T20లు ఆడారు.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved