యువరాజ్ సింగ్ రీఎంట్రీ కన్ఫార్మ్... నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న యువీ...
First Published Dec 15, 2020, 3:37 PM IST
టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన యువీ, ఆ తర్వాత కొన్ని లీగ్‌ల్లో పాల్గొన్నాడు. 39 ఏళ్ల యువరాజ్ సింగ్ క్రికెట్ రీఎంట్రీ కోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేసుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో మొదలు కానున్న సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో యువరాజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ ద్వారా మళ్లీ క్రికెట్‌లోకి ప్రవేశించాలని భావిస్తున్నాడు...

ఇప్పటికే పంజాబ్ జట్టు ప్రకటించిన 30 మంది ప్రాబబుల్స్‌లో యువరాజ్ సింగ్‌కి చోటు దక్కింది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 31 దాకా జరిగే ఈ టోర్నీ కోసం ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు యువరాజ్...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?