Sourav Ganguly: రోడ్డు ప్రమాదంలో సౌరవ్ గంగూలీ
Sourav Ganguly's car accident: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుర్ద్వాన్ కు వెళ్లే దారిలో కారు ప్రమాదనికి గురయ్యారు. గంగూలీ కాన్వాయ్ లోని రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Image credit: PTI
Sourav Ganguly: టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కారు ప్రమాదానికి గురైంది. దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా తన కాన్వాయ్‌తో బుర్ద్వాన్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి సౌరవ్ గంగూలీ తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మీడియా నివేదికల ప్రకారం, అతని కాన్వాయ్ మధ్యలో ఒక లారీ వచ్చింది, దాని కారణంగా కార్లు సడెన్ బ్రేకులు వేయాల్సి వచ్చింది. దీంతో ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో గంగూలీ గాయపడలేదని సమాచారం.
Sourav Ganguly
కాన్వాయ్ కార్లు ఢీకొన్నాయి
లారీ మధ్యలోకి రాగానే, గంగూలీ డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు, కానీ కాన్వాయ్ వెనుక ఉన్న వాహనాలు ఢీకొన్నాయి. అయితే, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదంలో దాదా, అతని కారుకు ఎటువంటి నష్టం జరగలేదని దాద్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. దాదా బుర్ద్వాన్ విశ్వవిద్యాలయానికి వెళ్తున్నారు.
ప్రమాదం తర్వాత, దాదా చాలా సమయం రోడ్డుపై వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కార్యక్రమానికి వెళ్లిపోయారు. గంగూలీ బుర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్తున్నాడు.
Sourav Ganguly resigns as BCCI president
కాగా, సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీ:) మాజీ అధ్యక్షుడు కూడా. భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన వ్యక్తిగా గంగూలీకి గుర్తింపు ఉంది. దాదా కెప్టెన్సీలో, భారత్ అనేక పెద్ద సిరీస్‌లను గెలుచుకుంది. విదేశాలలో అద్భుతమైన విజయాలు టీమిండియా అదుకుంది.
అక్టోబర్ 2024లో గంగూలీ JSW స్పోర్ట్స్‌లో క్రికెట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళా జట్టుతో సహా అన్ని క్రికెట్ వెంచర్‌లను పర్యవేక్షించారు.
2025 WPL సీజన్ కు ముందు, గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. WPL వేలం నుండి కొత్త యంగ్ ప్లేయర్లను తీసుకువచ్చారు. గంగూలీ జట్టు సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ.. టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. WPL 2025 సీజన్ ప్రారంభం కావడంతో గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ మహిళా జట్టుకు ఆటగాళ్లకు మెంటర్ గా, జట్టు వ్యూహరచనలు చేస్తున్నారు.