ఇలా చేస్తూ, జో రూట్ ఈజీగా అవుటైపోతాడు... టీమిండియాకు మనోజ్ తివారీ సలహా...
తొలి టెస్టులో భారత జట్టుకి భారీ పరాభవం ఎదురైంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కి తగ్గట్టుగా భారత బ్యాట్స్‌మెన్ కూడా రాణించారు. అయితే ఇరు జట్లలో ఉన్న ప్రధానమైన వ్యత్యాసం జో రూట్... డబుల్ సెంచరీ 218 పరుగులతో చెలరేగగా, టీమిండియా 227 పరుగుల తేడాతో ఓడింది. శ్రీలంక పర్యటనలో భారీ స్కోరు చేసి, అదే జోరును టీమిండియాపైనా చూపిస్తున్న జో రూట్‌ను తేలిగ్గా అవుట్ చేసేందుకు ఫీల్డ్ ప్లేస్‌మెంట్ సూచించాడు భారత క్రికెటర్ మనోజ్ తివారీ.

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అయితే స్పిన్ బౌలింగ్‌లో కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ, తేలిగ్గా బౌండరీలు బాదాడు జో రూట్. క్రీజుకి నలువైపులా పరుగుల వరద పారించిన జో రూట్ కారణంగా భారత బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.

తొలి ఇన్నింగ్స్‌లో 377 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 218 పరుగులు చేసి షాబజ్ నదీం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు జో రూట్. రెండో ఇన్నింగ్స్‌లోనూ 32 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు... రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్‌ను బుమ్రా అవుట్ చేశాడు...

స్పిన్ బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు రాబడుతున్న జో రూట్‌ని అవుట్ చేసేందుకు ఫీల్డింగ్‌లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని సూచించాడు భారత క్రికెటర్ మనోజ్ తివారీ. స్పిన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్లు ఆడుతున్న జో రూట్‌ను అదే వ్యూహ్యంతో అవుట్ చేయవచ్చని పేపర్ మ్యాప్‌ను పోస్టు చేశాడు మనోజ్ తివారి. ఇద్దరిని ఆఫ్ సైడ్‌లో పెట్టి, లెగ్ సైడ్‌లో ఏడుగురు ఫీల్డర్లను ఉంచాలని సూచించాడు తివారి.

ఆఫ్ సైడ్‌లో షార్ట్ థర్డ్ మ్యాన్, మిడాఫ్‌లో ఫీల్డర్లను ఉంచిన తివారి,.. లెగ్ సైడ్‌లో లెగ్ స్లిప్, షార్ట్ లెగ్, షార్ట్ మిడ్ వికెట్, మిడాన్,... ఇలా బౌండరీలు ఆడేందుకు అవకాశం లేకుండా ఫీల్డర్లతో నింపేశాడు. ఈ మ్యాప్ పోస్టు చేసిన మనోజ్ తివారి, దీనిపై నెటిజన్లు లేవనెత్తిన ప్రశ్నలకు కూడా ఓపిగ్గా సమాధానాలు తెలిపాడు...

క్యారమ్ బాల్ వేయాల్సిన అవసరం లేకుండానే సాధారణ స్పిన్ బౌలింగ్‌లోనే జో రూట్‌ను తేలిగ్గా బుట్టలో వేయొచ్చని చెప్పాడు మనోజ్ తివారి. దేశవాళీ టోర్నీల్లో బెంగాల్ జట్టుకి నాయకత్వం వహిస్తున్న తివారీ, ఆ కెప్టెన్సీ స్కిల్స్ కారణంగానే జో రూట్ లాంటి ప్లేయర్‌ను అవుట్ చేసేందుకు వ్యూహం తయారుచేశానని చెప్పాడు...

టీమిండియా తరుపున 12 వన్డేలు ఆడిన మనోజ్ తివారి, ఓ సెంచరీతో 287 పరుగులు చేశాడు బౌలింగ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మూడు టీ20 మ్యాచులాడి 15 పరుగులు చేశాడు. అయితే 2015లో చివరి వన్డే ఆడిన తివారి, ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

35 ఏళ్ల మనోజ్ తివారి... వారం కిందట రిహానా ఇష్యూపై సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ అండ్ కో స్పందించిన తీరుపై వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ‘నా చిన్నతనం నుంచి తోలుబొమ్మలాట ఎప్పుడూ చూడలేదని...ఇదే తొలిసారిగా చూడడం’ అంటూ సెటైరికల్ పోస్టు పెట్టాడు మనోజ్ తివారి...