ఇకనైనా మీ రాజకీయాలు ఆపండి... బీసీసీఐ, విరాట్ కోహ్లీలపై మనోజ్ తివారి ఫైర్...
క్రికెట్‌కి వీడ్కోలు చెప్పకముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు మనోజ్ తివారి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్న మనోజ్ తివారి, భారత క్రికెట్ జట్టులో కొనసాగుతున్న వివాదాలపై ఫైర్ అయ్యాడు...

టీమిండియా తరుపున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచులు ఆడిన మనోజ్ తివారి... వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో సెంచరీతో చెలరేగాడు...
విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత భారత క్రికెట్ జట్టులో జరుగుతున్న అనవసర వివాదాలపై ఫైర్ అయ్యాడు మనోజ్ తివారి...
‘కొన్ని నెలల క్రితం టీ20 వరల్డ్‌కప్ గెలవడమే భారత జట్టు ప్రధాన లక్ష్యంగా ఉండింది. కానీ టోర్నీ ఆరంభానికి ముందు విరాట్, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...
విరాట్ కోహ్లీలాంటి కెప్టెన్ నుంచి ఇలాంటి నిర్ణయం అస్సలు ఊహించలేదు. ఓ అభిమానిగా విరాట్ కోహ్లీ నిర్ణయం నన్ను మరింత బాధపెట్టింది...
టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత విరాట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాల్సింది. ఈ నిర్ణయం కారణంగా ఫోకస్ మొత్తం టీమిండియా కెప్టెన్సీ మీదకి మళ్లింది...
రోజరోజుకీ ఈ కెప్టెన్సీ వివాదం పెరుగుతూ పోతోంది. ఇప్పుడు టీమిండియా కెప్టెన్సీ గురించి ఇంత పెద్ద రచ్చ చేయాల్సిన అవసరమే లేదు...
సమస్య ఎవరి మధ్య అనేది అందరికీ తెలుసు. వాళ్లిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి...
ఇలాంటి వివాదాలు, టీమ్ వాతావరణంపై ప్రభావం చూపిస్తాయి. జట్టు విజయాలు సాధించాలంటే టీమ్‌లో వాతావరణం బాగుండాలి. అప్పుడే ప్లేయర్లు ఆటపై పూర్తి ఫోకస్ పెట్టగలుగుతారు...
విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య సంబంధాలు బాగోలేవని అందరికీ తెలుస్తోంది. ఒకవేళ నిజంగా గొడవలు ఉన్నా బయటికి తెలియాల్సిన అవసరం ఏముంది?
విరాట్, గంగూలీ ఇద్దరూ ఎంతో మెచ్యూర్డ్ ప్లేయర్లు. కాబట్టి దీన్ని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు... అనవసరంగా ఎందుకు వివాదాన్ని పెద్దది చేస్తున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు క్రికెటర్, పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి...