భార్య రిన్నీతో జయ్‌దేవ్ ఉనద్కత్... కొత్త క్రికెట్ కపుల్ మోస్ట్ రొమాంటిక్ మూమెంట్స్...

First Published Feb 4, 2021, 12:59 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ లక్కీయెస్ట్ క్రికెటర్ ఎవ్వరంటే జయ్‌దేవ్ ఉనద్కడ్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. పెద్దగా వికెట్లు తీయకపోయినా, అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా 11 సీజన్లుగా ఐపీఎల్ ద్వారా అత్యధిక మొత్తం ఆర్జించిన క్రికెటర్లలో ఒకడు జయ్‌దేవ్ ఉనద్కడ్. 2018లో రూ.11.5 కోట్లు, 2019లో రూ.8.4 కోట్లు ఆర్జించిన జయ్‌దేవ్ ఉనద్కడ్, ఓ స్నేహితురాలు రిన్నీ కంటారియాను పెళ్లాడాడు. వృత్తిరీత్యా లాయర్ అయిన రిన్నీ, జయ్‌దేవ్ ఉనద్కడ్ నిశ్చితార్థానికి భారత క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా కూడా హాజరయ్యాడు.