MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 2024లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్లు వీరే

2024లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్లు వీరే

Year Ender 2024: 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికారు. వీరితో పాటు పలువురు స్టార్లు కూడా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 22 2024, 12:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్

టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. డిసెంబర్ 18న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మూడో టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 106 టెస్టుల్లో 537 వికెట్లతో అశ్విన్ భారత క్రికెట్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా నిలిచాడు. అశ్విన్ వన్డేల్లో 156 వికెట్లు, టీ20 క్రికెట్ లో 72 వికెట్లు తీసుకున్నాడు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టెస్టులు, వన్డే, టీ20 క్రికెట్ ఫార్మాట్ ఏదైనా సరే ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడుతూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. వార్నర్ భాయ్ 20,000 కంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు చేశాడు. ఇందులో 48 సెంచరీలు ఉన్నాయి.

డీన్ ఎల్గర్

దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ డీన్ ఎల్గర్ 2024 ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడుర. టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన ప్లేయర్ గా గుర్తింపు పొందిన ఎల్గర్ 86 టెస్టుల్లో 5000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా జట్టుకు అతని నాయకత్వం, క్రీజులో అతని దృఢ సంకల్పం క్రికెట్ చరిత్రలో అతనికి ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
 

36

శిఖర్ ధావన్

టీమిండియా స్టార్ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ 2024 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డేల్లో 17 కంటే ఎక్కువ సెంచరీలు బాదిన ధావన్.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ కు ధావన్ అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. 

రవీంద్ర జడేజా

భారత గర్వించదగ్గ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకరు. భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

46

విరాట్ కోహ్లీ 

క్రికెట్‌లో అద్భుతమైన కెరీర్ ను కలిగిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. భారత్ టీ20 ప్రపంచ కప్ 2024 గెలుచుకున్న తర్వాత పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఫైనల్లో కోహ్లీ చేసిన అజేయ 76 పరుగులు భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాయి.

రోహిత్ శర్మ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్ కు హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం రోహిత్ వన్డే, టెస్టు క్రికెట్ లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. 

56

జేమ్స్ అండర్సన్

ఇంగ్లాండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్ట్ క్రికెట్‌లో 704 వికెట్లు తీసుకున్న అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ లో విజయవంతమైన పేస్ బౌలర్ గా ఘనత సాధించాడు.

దినేష్ కార్తీక్

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ దినేష్ కార్తిక్ 2024లో అన్ని అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వికెట్ల దగ్గర అద్భుతాలు చేయడంతో పాటు కీలక, అవసరమైన సమయంలో సూపర్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ లకు గుర్తింపు పొందిన దినేష్ కార్తిక్.. భారత్ 2007లో టీ20 ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

 

66

కాలిన్ మున్రో

న్యూజిలాండ్ ఓపెనర్ కాలిన్ మున్రో 2024లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ అయిన మున్రో న్యూజిలాండ్ తరపున టీ20, వన్డే క్రికెట్ లో ఆడాడు.

హెన్రిచ్ క్లాసెన్

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ హెన్రిచ్ క్లాసెన్ 2024 ప్రారంభంలో తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. కొన్ని టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన క్లాసెన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఫోకస్ చేస్తున్నాడు. వన్డేలు, టీ20లలో సౌతాఫ్రికాకు అద్భుతమైన ఇన్నింగ్స్ విజయాలు అందించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL : ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదేనా? లేదా మళ్లీ హైదరాబాద్ అడ్డుపడుతుందా?
Recommended image2
RCB vs GT: ధర్మశాలలో ఆర్సీబీ విధ్వంసం.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన బెంగళూరు!
Recommended image3
IPL Hit Wicket : హిస్టరీలోనే ఇలాంటి అవుట్ ఎప్పుడూ చూసుండరు.. అయ్యో సాయి సుదర్శన్ ! ఇలా అవుటైతే ఏమనాలి బ్రో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved