టెస్టు టీమ్ అంటే రిషబ్ పంత్ ఉండాల్సిందే... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులో...
2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్. సిడ్నీ టెస్టులో, బ్రిస్బేన్ టెస్టులో రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్‌లు... అతని కెరీర్‌ని మలుపు తిప్పాయి. దెబ్బకు వన్డే, టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారిపోయాడు...
సౌతాఫ్రికా టూర్‌లో, ఇంగ్లాండ్ పర్యటనలో భారత సీనియర్ ప్లేయర్లు ఫెయిల్ అయిన చోట రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. కేప్ టౌన్ టెస్టులో ఒంటరి పోరాటం చేసి అద్భుత సెంచరీ నమోదు చేశాడు...
Rishabh Pant
గత ఏడాది డిసెంబర్ 30న రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురి కావడం, టీమ్‌కి భారీ షాక్. 2020 నుంచి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ రిషబ్ పంత్ లేకుండా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది టీమిండియా...
2021 జనవరి నుంచి టీమిండియా తరుపున టెస్టుల్లో 38 ఇన్నింగ్స్‌ల్లో 1517 పరుగులు చేశాడు రిషబ్ పంత్. ఛతేశ్వర్ పూజారా 50 ఇన్నింగ్స్‌ల్లో 1414 పరుగులు చేసి రెండో స్థఆనంలో ఉన్నాడు.. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి...
Rishabh Pant-Pujara
తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా, డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌కి ప్రకటించిన బెస్ట్ టెస్ట్ టీమ్‌లో రిషబ్ పంత్‌కి చోటు దక్కింది. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి 2023 వరకూ టెస్టుల్లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ప్లేయర్లను ఏరి కోరి ఈ టీమ్‌కి సెలక్ట్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా...
Image credit: PTI
ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో పాటు శ్రీలంక బ్యాటర్ దిముత్ కరుణరత్నే, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్, ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌లకు ఈ టీమ్‌లో చోటు దక్కింది..
అలాగే భారత టెస్టు ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఈ టీమ్‌కి ఎంపికయ్యాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, డబ్ల్యూటీసీ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌కి కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.
దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడాతో పాటు ఇంగ్లాండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌కి డబ్ల్యూటీసీ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో చోటు దక్కింది.
డబ్ల్యూటీసీ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇలా ఉంది: ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, బాబర్ ఆజమ్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, ఉస్మాన్ ఖవాజా (కెప్టెన్), కగిసో రబాడా, జేమ్స్ అండర్సన్.