MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • కుంబ్లే, నన్ను టీమ్ నుంచి తప్పించాడు! అందుకే పంజాబ్ కింగ్స్, అతన్ని తీసేసింది - క్రిస్ గేల్...

కుంబ్లే, నన్ను టీమ్ నుంచి తప్పించాడు! అందుకే పంజాబ్ కింగ్స్, అతన్ని తీసేసింది - క్రిస్ గేల్...

ప్రతీ సీజన్‌కి ముందు కెప్టెన్‌ని మార్చడం పంజాబ్ కింగ్స్‌కి బాగా అలవాటు. ఈసారి కెప్టెన్‌తో పాటు హెడ్ కోచ్‌ని కూడా మార్చేసింది పంజాబ్ కింగ్స్. నాలుగేళ్లుగా పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లేని తప్పించి, ట్రేవర్ బేలిస్‌కి బాధ్యతలు అప్పగించింది ప్రీతి జింటా టీమ్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 29 2022, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image credit: PBKS

Image credit: PBKS

2019 అక్టోబర్ నుంచి పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. కుంబ్లే కోచింగ్‌లో వరుసగా నాలుగు సీజన్లలో ఆరో స్థానంలో నిలిచింది పంజాబ్ కింగ్స్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

టీమిండియాకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన సమయంలో అనిల్ కుంబ్లేకి, అప్పటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి ఆరోపణలే చేశాడు వెస్టిండీస్ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్...

38
Chris Gayle-Photo Credit BCCI

Chris Gayle-Photo Credit BCCI

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటూ వస్తున్న క్రిస్ గేల్, ఐపీఎల్ 2022 సీజన్‌లో పాల్గొనలేదు. 2023 సీజన్‌లో తిరిగి ఎంట్రీ ఇస్తానని ప్రకటించినా, మినీ వేలానికి రిజిస్టర్ చేయించుకోలేదు. దీంతో ప్లేయర్‌గా క్రిస్ గేల్ కెరీర్‌ ముగిసినట్టే...

48
Image credit: IPL

Image credit: IPL

‘ఐపీఎల్ టైటిల్ గెలవడానికి కావాల్సిన అదృష్టం నాకు లేదనుకుంటా... ఇంతకంటే ఏం చెప్పాలి!’ అంటూ వ్యాఖ్యానించాడు క్రిస్ గేల్. గేల్ పక్కన కూర్చున్న అనిల్ కుంబ్లే వెంటనే... ‘అవును... నాది కూడా సేమ్ సీన్’ అంటూ కామెంట్ చేశాడు...
 

58
Chris Gayle

Chris Gayle

అనిల్ కుంబ్లే చేసిన కామెంట్లపై వెంటనే స్పందించిన క్రిస్ గేల్... ‘నాకు కొన్ని సార్లు అదృష్టం కలిసి రాలేదు. అయితే అనిల్ కుంబ్లే ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌లో లేడు. అతను టీమ్‌లో ఉన్నప్పుడు నన్ను రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టాడు...

68
Image credit: LLC

Image credit: LLC

జట్టులో నుంచి తీసేశాడు. అందుకే పంజాబ్ కింగ్స్ అతన్ని తీసేసి, నా పక్కన కూర్చోబెట్టింది. నాకు తగిన గౌరవం దక్కి ఉంటే ఈ పాటికి ఇద్దరం ఐపీఎల్ టైటిల్ గెలిచేవాళ్లమేమో...’ అంటూ కామెంట్ చేశాడు. ఈ మాటకు ఏం చెప్పాలో తెలియక నవ్వేసి ఊరుకున్నాడు అనిల్ కుంబ్లే...

78

ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్‌ని రూ.18 కోట్ల 50 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. ఐపీఎల్‌లో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా టాప్‌లో నిలిచిన సామ్ కుర్రాన్... విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, క్రిస్ మోరిస్ రికార్డులను చెరిపేశాడు...

88

కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ తరుపున 2020, 2021 సీజన్లు ఆడాడు క్రిస్ గేల్. అయితే ఈ రెండు సీజన్లలో క్రిస్ గేల్‌కి తుదిజట్టులో చోటు దక్కిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌లో కూర్చున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ.. ఈ కారణంగానే 2021 సీజన్ మధ్యలో నుంచి తప్పుకున్న క్రిస్ గేల్.. ‘తనకి ఐపీఎల్‌లో దక్కాల్సిన గౌరవం దక్కలేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved