- Home
- Sports
- Cricket
- ఆర్‌సీబీ, ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడానికి అదే కారణం... టీమ్‌లో ఎంత మంది ఉన్నా, మా ముగ్గురికి మాత్రమే..
ఆర్‌సీబీ, ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడానికి అదే కారణం... టీమ్‌లో ఎంత మంది ఉన్నా, మా ముగ్గురికి మాత్రమే..
ఐపీఎల్‌లో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్‌లో ఆర్‌సీబీ ఒకటి. నిజానికి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి సక్సెస్‌ఫుల్ టీమ్‌కి ఫాలోయింగ్, క్రేజ్ ఉండడం పెద్ద విషయం కాదు కానీ 15 సీజన్లుగా టైటిల్ గెలవకపోయినా ఆర్‌సీబీకి అండగా నిలుస్తున్నారు అభిమానులు... ఇంత ఫాలోయింగ్ ఉన్నా, స్టార్ ప్లేయర్లు పుష్కలంగా ఉన్నా ఆర్‌సీబీ మాత్రం ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది...

2011 నుంచి ఏడు సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, ఆర్‌సీబీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు క్రిస్ గేల్ 333, ఏబీ డివిల్లియర్స్ 17 జెర్సీ నెంబర్‌లను రిటైర్ చేయనుంది ఆర్‌సీబీ.. ఈ జెర్సీ నెంబర్లను మరే ప్లేయర్ కూడా వాడకూడదు...
‘ఆర్‌సీబీ తరుపున ఆడడాన్ని నేను ఫుల్లుగా ఎంజాయ్ చేశా. ఫ్రాంఛైజీకి మెయిన్ ప్లేయర్‌గా ఉండడం చాలా స్పెషల్ ఫీలింగ్. అది నాకు దక్కిన గౌరవంగా భావించా. అందుకే ఎప్పుడూ ప్రెషర్‌కి లోను కాకుండా నా స్టైల్‌లో ఆడుతూ పోయాను...
అయితే ఆర్‌సీబీ అంటే చాలామందికి ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ మాత్రమే గుర్తుకు వస్తారు. మేం ముగ్గురం స్పెషల్ ప్లేయర్లుగా గుర్తించబడడంతో మిగిలిన చాలా మంది ప్లేయర్లకు ఆర్‌సీబీ తరుపున ఆడుతున్నామనే ఫీలింగ్ కలగలేదు...
చాలామంది ఆర్‌సీబీ తరుపున ఆడుతున్నా, టీమ్‌లో ఉన్నట్టుగా ఫీల్ కాలేకపోయారు. ఎందుకంటే కేవలం ముగ్గురు ప్లేయర్ల గురించి మాత్రమే అందరూ మాట్లాడుకునేవాళ్లు. మిగిలిన ప్లేయర్లు ఎంత బాగా ఆడినా వారి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు.. అందుకే మానసికంగా వాళ్లు, ఆర్‌సీబీని తమ టీమ్‌ని అనుకోలేకపోయారు...
ఆర్‌సీబీ టైటిల్ గెలవకపోవడానికి ఇదే ప్రధాన కారణం. టీమ్‌లో ఉన్న ప్రతీ ప్లేయర్ ఇది నా ఫ్రాంఛైజీ, నా టీమ్ అనుకుంటే టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఆర్‌సీబీలో స్టార్ ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నారు..’ అంటూ కామెంట్ చేశాడు ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్...
కెఎల్ రాహుల్ కూడా ఆర్‌సీబీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ఆర్‌సీబీలో ఉంటే ఊపిరి ఆడేది కాదు. టీమ్‌లో అందరూ స్టార్ ప్లేయర్లే. నాకు నేనే చిన్నగా కనిపించేవాడిని. బయటికి వచ్చాక ఫ్రీగా గాలి పీల్చుకోగలుగుతున్నా...’ అంటూ వ్యాఖ్యానించాడు కెఎల్ రాహుల్...
ఆర్‌సీబీలో ఫెయిల్ అయిన ప్లేయర్లు, వేరే ఫ్రాంఛైజీకి ఆడి టైటిల్స్ గెలిచారు. ఆర్‌సీబీ 2016 ఫైనల్ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచిన షేన్ వాట్సన్, 2019లో చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడో టైటిల్ అందించాడు...
అలాగే ఆర్‌సీబీ నుంచి బయటికి వచ్చిన తర్వాత జాక్వస్ కలీస్, కేకేఆర్‌కి రెండు టైటిల్స్ అందించగా యువరాజ్ సింగ్, మనీశ్ పాండే, రాబిన్ ఊతప్ప, క్వింటన్ డి కాక్, మొయిన్ ఆలీ.. ఐపీఎల్ టైటిల్స్ గెలిచారు. అలాగే ఆర్‌సీబీ నుంచి బయటికి వచ్చిన మార్కస్ స్టోయినిస్, కెఎల్ రాహుల్ వేరే ఫ్రాంఛైజీల తరుపున మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు..