ఛతేశ్వర్ పూజారా తీన్‌మార్... కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ముచ్చటగా మూడో సెంచరీ...
సౌతాఫ్రికా టూర్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా... రీఎంట్రీ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న పూజారా, అక్కడ రికార్డు స్థాయిలో మూడో సెంచరీ నమోదు చేశాడు...

కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో సుసెక్స్ క్లబ్ తరుపున ఆడుతున్న ఛతేశ్వర్ పూజారా... సీజన్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు. డర్భీషేర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసి అవుటైన పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...
పూజారా డబుల్ సెంచరీ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడినా ఆ టెస్టును డ్రా చేసుకోగలిగింది సుసెక్స్. ఆ తర్వాత వోర్కేస్టర్‌షేర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 206 బంతుల్లో 16 ఫోర్లతో 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు పూజారా...
Cheteshwar Pujara
అయితే మిగిలిన బ్యాట్స్‌మెన్ నుంచి సరైన సహకారం అందకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులకు ఆలౌట్ అయ్యి, ఫాలోఆన్ ఆడిన సుసెక్స్... రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగులకి కుప్పకూలింది.
Mohammad Rizwan
తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పూజారా రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
తాజాగా డర్హమ్ కౌంటీ క్లబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో సెంచరీ నమోదు చేశాడు పూజారా. తొలి రోజు డర్హమ్ 223 పరుగులకి ఆలౌట్ కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి సుసెక్స్ 139 పరుగుల ఆధిక్యం సంపాదించింది...
ఛతేశ్వర్ పూజారా 198 బంతుల్లో 16 ఫోర్లతో 128 పరుగులు చేసి అజేయంగా నిలవగా, అతనితో పాటు పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు..103 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది సుసెక్స్...
కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 సీజన్‌లో మూడు సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు పూజారా. పాక్ క్రికెటర్ షాన్ మసూద్ రెండు డబుల్ సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు...
Cheteshwar Pujara
టీమిండియా తరుపున మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన ఛతేశ్వర్ పూజారా, జూలై నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టులో ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి...