చెన్నై ఎఫెక్ట్... అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సీఎస్‌కే ప్లేయర్...

First Published 2, Nov 2020, 5:33 PM

IPL 2020 సీజన్‌లో ఎప్పుడూ లేనంత ఘోరమైన ప్రదర్శన ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. 14 మ్యాచుల్లో కేవలం ఆరే ఆరు విజయాలు అందుకుని 8 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిల్యూర్‌తో సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్ వంటి సీనియర్లపై పలు విమర్శలు వచ్చాయి. దీంతో సీఎస్‌కే ప్లేయర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు...

2015లో కెరీర్‌లో చివరిసారిగా అంతర్జాతీయ  మ్యాచులు ఆడిన షేన్ వాట్సన్... ఐపీఎల్ వంటి లీగుల్లో మాత్రం కొనసాగుతున్నాడు.

రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన షేన్ వాట్సన్... 2016 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు.

గత ఏడాది ఫైనల్ మ్యాచ్‌లో కాలికి గాయమై రక్తం కారుతున్నా బ్యాటింగ్ కొనసాగించి, అందరి ప్రశంసలు అందుకున్నాడు షేన్ వాట్సన్...

తాను అలాంటి పర్ఫామెన్స్ ఇవ్వడానికి కారణం ‘మహేంద్ర సింగ్ ధోనీ తనపైన పెట్టిన నమ్మకమే కారణం’ అని అన్నాడు షేన్ వాట్సన్...

ఈ సీజన్‌లో 11 మ్యాచులు ఆడిన షేన్ వాట్సన్... 2 హాఫ్ సెంచరీలతో 299 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన కారణంగా జట్టులో సమూల మార్పులు చేయాలని భావించింది సీఎస్‌కే యాజమాన్యం.

దీంతో అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్ల నుంచి, లీగ్‌ల నుంచి కూడా వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు షేన్ వాట్సన్...

ఐపీఎల్‌లో 145 మ్యాచులు ఆడిన షేన్ వాట్సన్... 3874 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలతో పాటు 92 వికెట్లు కూడా ఉన్నాయి.

2008, 2013 సీజన్లలో ఆరెంజ్ క్యాప్ గెలిచిన షేన్ వాట్సన్, ఐపీఎల్‌లో సెంచరీ, హ్యాట్రిక్ సాధించిన అతికొద్ది మంది ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు.