ఛాంపియన్స్ ట్రోఫీ: సొంత మైదానంలో చిత్తైన పాకిస్తాన్
Pakistan vs New Zealand: కరాచీలోని నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో విల్ యంగ్, టామ్ లాథమ్ లు సెంచరీలతో పాకిస్తాన్ పై న్యూజిలాండ్ సూపర్ విక్టరీ అందుకుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Pakistan vs New Zealand
Pakistan vs New Zealand: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్తాన్ ను బిగ్ షాక్ తగిలింది. ఘనంగా టోర్నీని ప్రారంభించాలని చూసిన పాకిస్తాన్ కు న్యూజిలాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌తో ఈ ఐసీసీ టోర్నీలో తొలి మ్యాచ్ లో తలపడింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్లు అద్భుతమైన ఆటతో పాకిస్తాన్ బౌలింగ్ ను చిత్తు చేశారు.
విల్ యంగ్, టామ్ లాథమ్ లు సూపర్ బ్యాటింగ్ తో సెంచరీలు సాధించారు. వీరికి తోడుగా గ్లెన్ ఫిలిప్స్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 320 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు విల్ యంగ్ 107 పరుగులు, టామ్ లాథమ్ 118 పరుగుల ఇన్నింగ్స్ లతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. చివరలో గ్లెన్ ఫిలిప్స్ ధనాధన్ ఇన్నింగ్స్ తో 61 పరుగులు సాధించాడు. దీంతో పాకిస్తాన్ పై కీవీస్ జట్టు 50 ఓవర్లలో 320/5 పరుగులు చేసింది.
Babar Azam
విల్ యంగ్, టామ్ లాథమ్ సెంచరీలు
ఈ మ్యాచ్ లో కీవీస్ ప్లేయర్లు విల్ యంగ్, టాల్ లాథమ్ లు సెంచరీలతో దరగొట్టారు. విల్ యంగ్ పాకిస్థాన్‌పై 113 బంతుల్లో 107 పరుగులు (12 ఫోర్లు, ఒక సిక్స్) చేసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. విల్ యంగ్ కు ఇది వన్డేల్లో నాల్గో సంచరీ కాగా, పాకిస్థాన్‌పై మొదటిది.
విల్ యంగ్ సెంచరీ తర్వాత టామ్ లాథమ్ కూడా సెంచరీని పూర్తి చేశాడు. టామ్ లాథమ్ 104 బంతుల్లో 10 బౌండరీలు, 3 సిక్సర్లతో 118 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ 320/5 స్కోరు చేయగలిగింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ 260 పరుగులకే ఆలౌట్ అయింది. 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై కివీస్ విజయం సాధించింది.
సొంత మైదానంలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కావడంతో అక్కడి పరిస్థితులు బాగా తెలియడంలో పాక్ కు కలిసివచ్చే అంశం. అందుకే టోర్నీని విజయంతో మొదలుపెట్టాలని చూసింది. కానీ, న్యూజిలాండ్ దెబ్బకు చిత్తుగా ఓడింది.
321 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ కు గొప్ప ఆరంభం లభించలేదు. త్వరగానే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో తర్వాత క్రీజులో ఉన్న బ్యాటర్లు స్లోగా పరుగులు చేశారు. బాబార్ ఆజం ఏకంగా 90 బంతులు ఆడి 64 పరుగులు చేశాడు. ఫఖర్ జమాన్ 41 బంతులు ఆడి 21 పరుగులతో పెవిలియన్ కు చేరారు. దీంతో సాధించాల్సిన రన్ రేటు పెరిగిపోయింది. సల్మాన్ ఆఘా 42 పరుగులు, ఖుష్దిల్ షా 69 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన మరో ఎండ్ లో వికెట్లు పడటం కొనసాగింది. దీంతో పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. మిచెల్ సాంట్నర్ 3, విలియం ఓరూర్కే 3 వికెట్లు తీసుకున్నారు.