NZ vs SA: సౌతాఫ్రికాను దంచికొట్టిన రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ !
Champions Trophy 2025 semi-final NZ vs SA: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీ-ఫైనల్ లో న్యూజిలాండ్ ప్లేయర్లు కేన్ విలియమ్స్, రచిన్ రవీంద్రలు దక్షిణాఫ్రికా బౌలింగ్ ను దంచికొట్టారు. ఇద్దరు సెంచరీలు సాధించారు.

Champions Trophy 2025 semi-final NZ vs SA: Kane Williamson
Champions Trophy 2025 semi-final NZ vs SA: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ దూకుడు కొనసాగుతోంది. అద్భుతమైన బ్యాటింగ్ తో ఆ జట్టు ప్లేయర్లు సౌతాఫ్రికా బౌలింగ్ ను చెగుడు ఆడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కీవీస్ స్టార్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సూపర్ సెంచరీలతో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ - దక్షిణాఫ్రికాలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతోంది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
దీంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ అద్భుతమైన ఆటతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ లు సెంచరీలు సాధించారు.
ఐదో వన్డే సెంచరీ కొట్టిన రచిర్ రవీంద్ర
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు శుభారంభం లభించింది. విల్ యంగ్, రచిన్ రవీంద్ర కలిసి 7.5 ఓవర్లలో 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 22 పరుగులు చేసిన తర్వాత యంగ్‌ను లుంగి ఎంగిడి అవుట్ చేశాడు.
దీని తర్వాత, కేన్ విలియమ్సన్ - రచిన్ రవీంద్ర కలిసి రెండో వికెట్‌కు 164 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సమయంలో, రచిన్ రవీంద్ర తన వన్డే అంతర్జాతీయ కెరీర్‌లో ఐదో సెంచరీ కొట్టాడు. ఈ ఐదు సెంచరీలను ఐసీసీ టోర్నమెంట్లలోనే సాధించడం విశేషం.
Image Credit: Getty Images
కేన్ విలియమ్సన్ సూపర్ సెంచరీ
రచిన్ రవీంద్ర 108 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తన సెంచరీ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ కూడా సెంచరీ సాధించాడు. దూకుడుగా ఆడుతున్న కేన్ మామ 94 బంతుల్లో 102 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. తన సెంచరీ ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ 10 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
rachin ravindra
చివరలో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్
ఆ తర్వాత డారిల్ మిచెల్ కూడా దూకుడుగా ఆడుతూ న్యూజిలాండ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 37 బంతుల్లో 49 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అలాగే, గ్లెన్ ఫిలిప్స్ ధనాధన్ ఇన్నింగ్స్ తో 27 బంతుల్లో 49 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో 50 ఓవర్లలో న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది.
కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. ఫైనల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టుతో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ మ్యాచ్ మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత జట్టు ఫైనల్లోకి చేరింది.
Champions Trophy 2025 semi-final NZ vs SA: Kane Williamson
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సౌతాఫ్రికా - న్యూజిలాండ్ జట్లు
న్యూజిలాండ్ జట్టు: డారిల్ మిచెల్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, రాచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జామిసన్, మాట్ హెన్రీ, విలియం ఓ'రూర్కే.
దక్షిణాఫ్రికా జట్టు: ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.