ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత జట్టులో బ్యాటింగ్ బ్యాలెన్స్ తప్పిందా? అశ్విన్ ఆందోళన దేనికి?
Champions Trophy 2025: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టు పై మాజీ స్టార్ బౌలర్ రవిచంద్రన్ ఆశ్విన్ ఆందోళన వ్యక్తం చేశారు. జట్టులో బ్యాటింగ్ బ్యాలెన్స్ తప్పిందని పేర్కొన్నాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత జట్టును ప్రకటించింది. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టు గురించి మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 19న పాకిస్తాన్, యూఏఈలలో ప్రారంభం కానున్న ఈ మిని వరల్డ్ కప్ టోర్నీ గురించి అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ భారత జట్టు కూర్పును విశ్లేషించి, కీలక సమస్యలను గురించి ప్రస్తావించారు.
భారత జట్టులో బ్యాటింగ్ బ్యాలన్స్ లోపించింది...
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టులో బ్యాటింగ్ బ్యాలన్స్ లోపించిందని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. అయితే, తుది జట్టు (ప్లేయింగ్ 11) అంచనాలు గమనిస్తే గత 2023 వన్డే ప్రపంచ కప్ ను పోటీ ఉంటుందని తెలిపాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేస్తే.. తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉంటారని చెప్పారు. వీరి తర్వాత ఆరో స్థానంలో రవీంద్ర జడేజా లేదా అక్షర్ పటేల్ ఉంటే.. హార్దిక్ పాండ్యా ఏడో స్థానంలో ఉంటారని చెప్పారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత జట్టులో అది గమనించారా?: రవిచంద్రన్ అశ్విన్
అయితే, ఏడవ స్థానం వరకు బ్యాటింగ్ ఆర్డర్ ను గమనిస్తే ఒక విషయం మను స్పష్టంగా తెలుసుందనీ, అదే ఎడమచేతి వాటం బ్యాటర్ లేకపోవడమని అశ్విన్ చెప్పారు. "ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రకటించిన భారత జట్టు 2023 వన్డే ప్రపంచ కప్ లో ఆడిన భారత జట్టును తలపిస్తోంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీకాగా, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్నారు. ఆరో స్థానంలో జడేజా లేదా అక్షర్ పటేల్ వుండగా, హార్దిక్ పాండ్యా ఏడో స్థానంలో ఉన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో మొదటి ఏడుగురిలో ఎడమచేతి బ్యాటర్లు ఒక్కరు కూడా లేదు. అలాగే, జట్టులో భాగంగా ఉన్న యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ బెంచ్ కే పరిమితం కావచ్చునని" అభిప్రాయపడ్డారు.
జైస్వాల్ ఫామ్‌ను ఉపయోగించుకోవాలి: అశ్విన్
యశస్వి జైస్వాల్ ఎంపికపై కూడా అశ్విన్ స్పందించారు. 15 మంది సభ్యుల భారత టీమ్ లో యశస్వి జైస్వాల్ ఉన్నప్పటికీ అతనికి ప్లేయింగ్ XIలో ఆడే అవకాశాలు రాకపోవచ్చని అన్నారు. కానీ, జైస్వాల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేయాలని సూచించారు.
"అతనికి గాయాలు మిగిలేలా ఉన్నాయి.. ప్లేయింగ్ 11 లో జైస్వాల్ ఆడకపోవచ్చు. ఇంగ్లాండ్‌పై అవకాశం రావచ్చు. ఈ ఛాన్స్ ను ఉపయోగించుకుని వరుసగా సెంచరీలు చేస్తే? జైస్వాల్, రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేయొచ్చు. దీంతో గిల్ 3కి, విరాట్ 4కి మారతారు. పంత్ లేదా రాహుల్ 5వ స్థానంలో ఉంటారు. జైస్వాల్ ఆడితే, శ్రేయాస్‌ను తప్పించవచ్చు. అవకాశం తక్కువైనా, జైస్వాల్ ఫామ్‌ను ఉపయోగించుకోవాలి" అని ఆశ్విన్ అన్నారు.
గెట్టీ ఇమేజెస్
ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు పేసర్లతో భారత జట్టు
వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ XIకి చేర్చవచ్చని ఆశ్విన్ అన్నారు. సుందర్ బ్యాటింగ్‌పై కోచ్ గౌతమ్ గంభీర్‌కు నమ్మకం ఉందని చెప్పారు. సుందర్ చేరికతో జట్టు సమతుల్యత పెరుగుతుందని, 8వ బ్యాటర్, అదనపు స్పిన్ అందుబాటులో ఉంటుందని సూచించారు.
"మరో అవకాశం సుందర్‌ది. గంభీర్ సుందర్ బ్యాటింగ్‌ను విలువైనదిగా భావిస్తారు. ఫ్లోటర్‌గా వాడుకోవచ్చు. ప్రపంచ కప్ ఫార్మాట్‌ను అనుసరిస్తే, జడేజా లేదా అక్షర్ 6వ స్థానంలో, హార్దిక్ 7వ స్థానంలో, సుందర్ 8వ స్థానంలో ఆడతారు. దీంతో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు లేదా కుల్దీప్, ఇద్దరు పేసర్లు ఆడొచ్చు. హార్దిక్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో సమతుల్యత ఉంటుంది" అని ఆశ్విన్ వివరించారు.
గెట్టీ ఇమేజెస్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని దుబాయ్ లో ఆడనున్న టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే, భారత్ అక్కడకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పడంతో తన మ్యాచ్ లను దుబాయ్ లో ఆడటానికి ఐసీసీ ఒప్పుకుంది. భారత మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతున్నందున మంచు ప్రభావం గురించి ఆశ్విన్ ప్రస్తావించారు. మంచు పరిస్థితుల్లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం సరైనదేనా అని ప్రశ్నించారు. నితీష్ కుమార్ రెడ్డిని 8వ బ్యాటర్‌గా పరిగణించవచ్చనీ, జట్టు ఎంపికలో మరింత సౌలభ్యం ఉంటుందని సూచించారు.
"సుందర్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేయాలి. నితీష్ రెడ్డి లాంటి ఆటగాడిని పరిగణలోకి తీసుకోవచ్చా? కుల్దీప్ 9వ స్థానంలో ఆడితే, ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు. నితీష్ 8వ స్థానంలో, కుల్దీప్ 9వ స్థానంలో, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఆడొచ్చు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల సౌలభ్యం ఉంటుంది. అతన్ని పరిగణించారో లేదో నాకు తెలియదు" అని చెప్పారు.