- Home
- Sports
- Cricket
- Champions Trophy : వరుసగా 10వ సారి ఓడిన రోహిత్ శర్మ.. భారత్ గెలుస్తుంది.. ఇదెక్కడిలెక్క సామి !
Champions Trophy : వరుసగా 10వ సారి ఓడిన రోహిత్ శర్మ.. భారత్ గెలుస్తుంది.. ఇదెక్కడిలెక్క సామి !
India vs New Zealand: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నిరాశపరిచారు.

Rohit Sharma
India vs New Zealand Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇండియా టాస్ ఓడిపోయింది. దీంతో భారత జట్టు వరుసగా 13వ సారి వరుసగా టాస్ ఓడిపోయి మరో చెత్త రికార్డును సాధించింది. గత మ్యాచ్ లో టీమిండియా వన్డేల్లో వరుసగా 12వ టాస్ ఓడిన రికార్డును సాధించింది. వరుసగా 11 టాస్ లు ఓడిన నెదర్లాండ్స్ రికార్డును బ్రేక్ చేసింది.
2023 ప్రపంచ కప్ ఫైనల్స్ నుండి భారత్ వరుసగా 12 టాస్‌లను కోల్పోయింది. వన్డేల్లో ఒక జట్టుకు టాస్ లు ఓడిపోవడం ఇదే అత్యధికం. ఇప్పుడు మరోసారి టాస్ ఓడిపోయింది. అంతకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ (మార్చి 2011 & ఆగస్టు 2013 మధ్య 11 టాస్‌లు ఓడిపోయింది) పేరిట ఉంది.
Rohit Sharma Toss
టాస్ లో రోహిత్ శర్మ చెత్త రికార్డు
భారత జట్టుతో పాటు రోహిత్ శర్మ కూడా టాస్ విషయంలో చెత్త రికార్డు నమోదుచేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ఇంటర్నేషనల్స్‌లో (ODIs) వరుసగా 10 టాస్‌లు ఓడిపోయాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ టాస్ ఓడిపోవడం మొదలైంది. అప్పటి నుంచి రోహిత్ దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో కూడా టాస్ ఓడిపోయి.. వరుసగా 10 టాస్ ఓటములను పూర్తి చేశాడు.
అత్యధిక టాస్ లు ఓడిపోయిన కెప్టెన్లు వీరే:
భారత కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 10వ సారి టాస్ ఓడిపోవడంతో వన్డేల్లో వరుసగా అత్యధిక టాస్‌లు కోల్పోయిన కెప్టెన్ల జాబితాలో హిట్ మ్యాన్ 3వ స్థానానికి చేరాడు.
బ్రియన్ లారా- 12 మ్యాచ్ టాస్ లు, అక్టోబర్ 1998 నుండి మే 1999 వరకు
పీటర్ బోర్రెన్ - 11 మ్యాచ్ టాస్ లు, మార్చి 2011 నుండి ఆగస్టు 2013 వరకు
రోహిత్ శర్మ - 10 మ్యాచ్ టాస్ లు, నవంబర్ 2023 నుండి మార్చి 2025 వరకు
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా అక్టోబర్ 1998 - మే 1999 మధ్య వరుసగా 12 టాస్ ఓడిపోయాడు. నెదర్లాండ్స్‌కు చెందిన పీటర్ బోరెన్ మార్చి 2011 నుంచి ఆగస్టు 2013 మధ్య వరుసగా 11 టాస్ ఓడిపోయాడు.
Image Credit: Getty Images
రోహిత్ టాస్‌లు ఓడితే భారత్ మ్యాచ్‌ను గెలుస్తుందా?
అయితే, రోహిత్ శర్మ వరుసగా టాస్ లో ఓడిపోతున్నా.. భారత అభిమానులు మాత్రం సంతోషంగా ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ లో ఆట ఎలా సాగుతుందో నిర్ణయించడంలో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేయాలో లేదా బౌలింగ్ చేయాలో నిర్ణయించుకునే అవకాశాన్ని ఇస్తుంది. అయితే, టాస్ ఫలితం ఎల్లప్పుడూ మ్యాచ్ స్పష్టమైన ఫలితాలన్ని ఇవ్వదు. కానీ వాతావరణ పరిస్థితులు, మ్యాచ్ జరిగే వేదిక, పిచ్ రిపోర్టులు గెలిచిన జట్టుకు ఇది వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది.
కాగా, రోహిత్ శర్మ టాస్ ఓడిపోతే భారత్ మ్యాచ్ తప్పకుండా గెలుస్తుందని భారత అభిమానులు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లను గమనిస్తే రోహిత్ శర్మ టాస్ ఓడిన మ్యాచ్ లలో ఎక్కువ మ్యాచ్ లలో భారత్ గెలిచింది. రోహిత్ శర్మ టాస్ ఓడిన ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా న్యూజిలాండ్ పై విజయాన్ని అందుకుంటుందని చెబుతున్నారు.