MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ధనశ్రీ వర్మ తో విడాకులు... క్లారిటీ ఇచ్చేసిన చాహల్..!

ధనశ్రీ వర్మ తో విడాకులు... క్లారిటీ ఇచ్చేసిన చాహల్..!

 ఆ విడాకుల వార్తలపై తాజాగా చాహల్ స్పందించాడు.తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో అవన్నీ రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 19 2022, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chahal Dhanasree

Chahal-Dhanasree

టీమిండియా క్రికెటర్లలో వన్ ఆఫ్ ది క్యూట్ కపుల్ ఎవరా అంటే.. ముందుగా యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ పేర్లు ఎక్కువగా వినపడతాయి. ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది.  అలాంటి ఈ జంట కూడా విడాకులు తీసుకుంటున్నారంటూ సడెన్ గా వార్తలు వచ్చాయి. ఈ వార్త క్రికెట్ ప్రియులను షాకింగ్ కి గురి చేసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, డాక్టర్  అయిన ధనశ్రీ వర్మను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లాడాడు యజ్వేంద్ర చాహాల్... అయితే రెండేళ్లకీ ఈ ఇద్దరికీ చెడిందనే వార్త హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరూ చేసిన పోస్టులే. వీరిద్దరి ఇన్ స్టాగ్రామ్ పోస్టులు చూసి.. వీరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.
 

37

కాగా.. ఆ విడాకుల వార్తలపై తాజాగా చాహల్ స్పందించాడు.తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో అవన్నీ రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ‘ మా రిలేషన్ కి సంబంధించిన రూమార్లేమీ నమ్మద్దని మీ అందరినీ కోరుతున్నా. ఈ రూమర్స్ ఆపేయండి’ అంటూ పేర్కొన్నాడు. ఆయన ఇచ్చిన క్లారిటీతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 

47

వృత్తిపరంగా డాక్టర్ అయిన ధనశ్రీ వర్మ.. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా చేస్తూ ఉంటారు. ఈ డ్యాన్స్ నేపథ్యంలోనే చాహల్ కి ఆమెతో పరిచయం ఏర్పడింది. అలా పరిచయమై ఈ ఇద్దరూ ప్రేమించుకుని, పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. ఎంగేజ్‌మెంట్ అయినా తర్వాత దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌ సమయంలో చాహాల్‌తో కలిసి గడిపింది ధనశ్రీ వర్మ..
 

57

ఐపీఎల్ 2021, 2022 సీజన్ సమయాల్లో ధనశ్రీ వర్మ సందడి కనిపించింది. భర్తకు సపోర్ట్ చేస్తూ డ్యాన్సులు కూడా చేసింది ధనశ్రీ. ఆర్‌సీబీలో ఏబీ డివిల్లియర్స్‌తో, రాజస్థాన్ రాయల్స్‌తో జోస్ బట్లర్‌తో స్టెప్పులు వేయించింది ధనశ్రీ వర్మ.
 

67

అంతాబాగానే ఉన్నా తాజాగా ఆమె తన ఇన్‌స్టా అకౌంట్ పేరును మార్చింది. యజ్వేంద్ర చాహాల్‌ని పెళ్లాడిన తర్వాత ఇన్‌స్టాలో తన అకౌంట్ హ్యాండిల్ పేరు ‘ధనశ్రీ చాహాల్’ అని ఉండేది. ఆమె దాన్ని మళ్లీ ‘ధనశ్రీ వర్మ’గా మార్చింది...అదీకాకుండా దిగులుగా కూర్చున్న ఫోటోలను షేర్ చేసి.. ‘ప్రిన్సెస్ ఎప్పుడూ తన నొప్పిని, పవర్‌గా మార్చుకుంటుంది’ అంటూ కాప్షన్ ఇచ్చింది...
 

77

ధనశ్రీ వర్మ పోస్టు చేసిన కొన్ని గంటలకే యజ్వేంద్ర చాహాల్ కూడా ‘న్యూ లైఫ్ లోడింగ్...’ అంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. దీంతో  వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా.. చాహల్ క్లారిటీతో వీరిద్దరి అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Recommended image2
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image3
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved