- Home
- Sports
- Cricket
- కెప్టెన్ అయ్యాక భార్యను పట్టించుకోని హిట్ మ్యాన్.. ప్లీజ్, ఒక్కసారి ఫోన్ చేయి అంటూ వేడుకుంటున్న రితికా
కెప్టెన్ అయ్యాక భార్యను పట్టించుకోని హిట్ మ్యాన్.. ప్లీజ్, ఒక్కసారి ఫోన్ చేయి అంటూ వేడుకుంటున్న రితికా
Rohit Sharma - Ritika Sajdeh: టీమిండియాకు మూడు ఫార్మాట్లలో సారథిగా వ్యవహరిస్తున్న హిట్ మ్యాన్.. తర్వాత రాబోయే టీ20, వన్డే ప్రపంచకప్ ల కోసం సిద్ధమవుతున్నాడు. కెప్టెన్ అయ్యాక ఫుల్ బిజీగా మారిన రోహిత్.. తన భార్యను కూడా పట్టించుకోవడం లేదు..

టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ భారత్ ను మూడు ఫార్మాట్లలో నడిపిస్తున్నాడు. స్వదేశంలో గతేడాది నవంబర్ లో న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను నెగ్గిన హిట్ మ్యాన్.. ఇటీవల విండీస్ తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్ లను కూడా కైవసం చేసుకున్నాడు.
ఈ రెండు సిరీస్ లను 3-0తో నెగ్గిన హిట్ మ్యాన్.. గురువారం నుంచి శ్రీలంకతో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ కు సన్నద్ధమవుతున్నాడు. ఈ మేరకు ఇప్పటికే లక్నో (తొలి టీ20 జరిగే వేదిక) చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ లో నిమగ్నమైంది.
అయితే సారథిగా ఫుల్ బిజీ అయిన రోహిత్ శర్మ.. తన భార్య రితికాతో ఫోన్ లో కూడా మట్లాడలేనంత బిజీగా గడుపుతున్నాడు. ఆమె ఫోన్ చేసినా దానికి స్పందించడం లేదట. ఇదే విషయాన్ని ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది.
అసలేం జరిగిందంటే... లంకతో సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మ ఇన్స్టా వేదికగా ఓ పోస్టును పెట్టాడు. తాను ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇక తర్వాత టార్గెట్ లంక.. నెక్స్ట్ అప్.. ’ అని రాసుకొచ్చాడు.
దీనికి హిట్ మ్యాన్ భార్య రితికా.. రోహిత్ ను ఉద్దేశించి ఫన్నీ కామెంట్ చేసింది. ‘అంతా బాగానే ఉంది కానీ నాకు కొంచెం కాల్ చేయు.. ప్లీజ్..’ అని కామెంట్ పెట్టింది.
ఇప్పుడు రోహిత్ పోస్టు, రితికా కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన ఈ ఇద్దరి ఫ్యాన్స్ తో పాటు టీమిండియా అభిమానులు.. ‘రోహిత్ భయ్యా.. నీ భార్యను కొంచెం పట్టించుకో.. ఎంత కెప్టెన్ అయితే మాత్రం ఫ్యామిలీని మరిచిపోతావా..?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలాఉండగా.. రేపు లక్నో వేదికగా ప్రారంభం కాబోయే తొలి టీ20తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ మొదలవనుంది. ఈనెల 26, 27న ధర్మశాలలో మిగతా రెండు టీ20 మ్యాచులు జరుగుతాయి.
ఆ తర్వాత రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొహాలీ లో తొలి టెస్టు (మార్చి 4-8 దాకా), బెంగళూరులో రెండో టెస్టు (12-16) జరుగనుంది. మొహాలీలో జరుగబోయే తొలి టెస్టు.. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి వందో టెస్టు కానుంది.