MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఫెవరెట్ అంటూ టీమిండియాని ముంచేయాలని చూస్తున్నారు... వన్డే వరల్డ్ కప్‌పై అశ్విన్ కామెంట్..

ఫెవరెట్ అంటూ టీమిండియాని ముంచేయాలని చూస్తున్నారు... వన్డే వరల్డ్ కప్‌పై అశ్విన్ కామెంట్..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు. 10 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా స్వదేశంలో ఘనమైన రికార్డు ఉండడమే టీమిండియా టైటిల్ ఫెవరెట్‌గా మారేందుకు కారణం. రికీ పాంటింగ్, గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి మాజీలు కూడా ఇండియా, వరల్డ్ కప్ ఫెవరెట్ అంటూ కామెంట్ చేశారు.. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 10 2023, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

2011 వన్డే వరల్డ్ కప్‌ టైటిల్ గెలిచిన భారత జట్టు, ఈసారి మరోసారి కప్పు గెలుస్తుందని అంటున్నారు మాజీ క్రికెటర్లు. అయితే ఇలా చెప్పడం వెనక చాలా పెద్ద స్ట్రాటెజీయే ఉందంటున్నాడు భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Ravichandran Ashwin

Ravichandran Ashwin

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత స్వదేశానికి వచ్చి తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్, వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌లో ఆడాడు. అక్కడికి రాగానే తమిళనాడులో జిల్లా క్రికెట్ టోర్నీలో ఆడుతున్నాడు..
 

37

‘క్రికెట్ ప్రపంచంలో చాలా మంది సీనియర్లు, ఇండియా ఫెవరెట్స్ అని చెబుతున్నారు. ఇప్పుడు కాదు, వరల్డ్ కప్ వచ్చిన ప్రతీసారీ టీమిండియా, టైటిల్ ఫెవరెట్‌గానే ఉంటోంది. దీని వెనక ఓ రకమైన స్ట్రాటెజీ ఉంది..
 

47

భారత జట్టును ఫెవరెట్, ఫెవరెట్ అని ప్లేయర్లపై తీవ్రమైన ప్రెషర్ పెంచుతున్నారు. ఫెవరెట్స్‌గా బరిలో దిగడం వల్ల టీమ్‌పై ప్రెషర్ రెట్టింపు అవుతుంది...
 

57

ఆస్ట్రేలియా ఓ పవర్ హౌజ్. వాళ్లు టైటిల్ ఫెవరెట్స్‌గా కచ్ఛితంగా ఉంటారు. బార్బోడాస్‌లో రెండో వన్డే ఓటమి గురించి చాలా చర్చ జరిగింది. వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంది..

67

ఒకటి రెండు మ్యాచుల్లో ఓడినంత మాత్రాన పోయేదేమీ లేదు. అయితే క్రికెట్ ఫ్యాన్స్, టీమ్ నుంచి చాలా ఆశిస్తారు. ఆశించిన పర్ఫామెన్స్ రాకపోతే ఆ కోపాన్ని టీమ్‌పైన చూపిస్తారు. అయితే ఇలాంటి సమయాల్లోనే టీమ్‌కి సపోర్ట్ అవసరం..

77
Ravichandran Ashwin

Ravichandran Ashwin

ఒక్కటి మాత్రం నిజం, ఈసారి వరల్డ్ కప్ మనమే పెడుతున్నాం, మన దగ్గర జరుగుతున్న టోర్నీ.. కాబట్టి మన టీమ్‌కి మన సపోర్ట్ ఇచ్చే ఎనర్జీ మరేదీ ఇవ్వదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL : ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదేనా? లేదా మళ్లీ హైదరాబాద్ అడ్డుపడుతుందా?
Recommended image2
RCB vs GT: ధర్మశాలలో ఆర్సీబీ విధ్వంసం.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన బెంగళూరు!
Recommended image3
IPL Hit Wicket : హిస్టరీలోనే ఇలాంటి అవుట్ ఎప్పుడూ చూసుండరు.. అయ్యో సాయి సుదర్శన్ ! ఇలా అవుటైతే ఏమనాలి బ్రో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved