MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నో బాల్స్ వల్లే ఓడిపోయాం! రిథమ్ లేకుండా ఆడడం ఎందుకు? టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

నో బాల్స్ వల్లే ఓడిపోయాం! రిథమ్ లేకుండా ఆడడం ఎందుకు? టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో ఓడింది టీమిండియా. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో పోరాడగా చివర్లో శివమ్ మావి బ్యాటుతోనూ మంచి పర్ఫామెన్స్ చూపించాడు. అయితే 207 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టాపార్డర్ వైఫల్యం టీమిండియాని తీవ్రంగా ప్రభావితం చేసింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 06 2023, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. వీరిలో హార్ధిక్ పాండ్యా తప్ప మిగిలిన ముగ్గురూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు...

27
arshdeep

arshdeep

అయితే బౌలింగ్‌లో టీమిండియా చేసిన పొరపాట్లకు టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా జ్వరంతో బాధపడుతూ తొలి టీ20కి దూరమైన అర్ష్‌దీప్ సింగ్, రెండో టీ20లో హర్షల్ పటేల్ ప్లేస్‌లో తుది జట్టులోకి వచ్చాడు...

37

రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్, ఏకంగా 5 నో బాల్స్ వేశాడు. ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి చెరో నో బాల్స్ వేయడంతో టీమిండియా ఏకంగా 7 నో బాల్స్ సమర్పించింది. ఈ నో బాల్స్, ఫ్రీ హిట్స్‌ ద్వారా శ్రీలంక స్కోరులో 30+ పరుగులు అదనంగా చేరాయి...

47
Team India vs sri lanka

Team India vs sri lanka

‘పవర్ ప్లేలు మాకు కలిసి రాలేదు. బౌలింగ్ పవర్ ప్లేలో అధికంగా పరుగులు ఇచ్చాం. బ్యాటింగ్ పవర్ ప్లేలో కీలక వికెట్లు కోల్పోయాం. మేం చాలా తప్పులు చేశాం. కొన్ని సార్లు ఎక్కువ పరుగులు ఇవ్వాల్సి వస్తుంది. అయితే బేసిక్స్ కూడా మరిచిపోయేంత చెత్త ప్రదర్శన అయితే ఊహించలేదు...

57
india vs sl

india vs sl

ఇంతకుముందు మ్యాచుల్లో కూడా మేం నో బాల్స్ వేశాం. అయితే మరీ ఇంత దారుణంగా ఎప్పుడూ వేయలేదు. ఎవ్వరినీ నిందించడం లేదు కానీ టీ20ల్లో నో బాల్స్ వేయడం నేరం... అర్ష్‌దీప్ సింగ్ రిథమ్ అందుకోవడానికి సమయం తీసుకుంటాడని అనుకోలేదు...

67

రిథమ్ లేకుండా ఆడడం వల్ల ఇలాంటి ఫలితాలే వస్తాయి. అతను కమ్‌బ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాం. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా సెటిల్ అయ్యాడు. 

77
Image credit: PTI

Image credit: PTI

సూర్యను తన ప్లేస్ నుంచి జరపడం కరెక్ట్ కాదు. కొత్త వాళ్లు ఎవరొచ్చినా వేరే స్థానాల్లో ఆడాల్సిందే.. అందుకే రాహుల్ త్రిపాఠిని మూడో స్థానంలో బ్యాటింగ్‌కి పంపించాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Rohit Sharma Net Worth: నాడు రూ. 275 ఫీజు కట్టలేక ఇబ్బందులు.. నేడు కోట్ల సామ్రాజ్యం.. రోహిత్ శర్మ నెట్‌వర్త్‌ ఎంత?
Recommended image2
IPL 2026 : ఐపీఎల్ ప్లేఆఫ్స్ లెక్కలివే... ఏ టీంకు ఎంత ఛాన్స్..!
Recommended image3
Virat Kohli : విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఫిక్స్? టీమిండియాలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved