మొదటి టెస్టుకి ముందు ఆస్ట్రేలియాకి భారీ ఊరట... టెస్టు సిరీస్ ఆడబోతున్న మిచెల్ స్టార్క్...

First Published Dec 13, 2020, 1:58 PM IST

టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకి భారీ ఊరట లభించింది. డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా యంగ్ బ్యాట్స్‌మెన్ విల్ పుకోవిస్కీ, స్టార్ బౌలర్ అబ్బాట్... గాయం కారణంగా మొదటి టెస్టుకి దూరం అయిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్న ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్, టెస్టు సిరీస్‌లో బరిలో దిగబోతున్నాడు.

టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతున్న సమయంలో మిచెల్ స్టార్క్ కుటుంబం కరోనా బారిన పడింది. దాంతో అర్ధాంతరంగా సిరీస్ మధ్య నుంచి తప్పుకున్నాడు స్టార్క్.

ప్రస్తుతం స్టార్క్ ఫ్యామిలీ కరోనా నుంచి కోలుకోవడంతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు ఈ సీనియర్ పేసర్.

మిచెల్ స్టార్క్‌కి టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. పింక్ బాల్ టెస్టుల్లో అయితే మిచెల్ స్టార్క్ ట్రాక్ రికార్డు మరే బౌలర్‌కీ లేదు...

ఇప్పటిదాకా ఏడు డే నైట్ టెస్టు మ్యాచులు ఆడిన మిచెల్ స్టార్క్... 19.23 సగటుతో 42 వికెట్లు పడగొట్టాడు...

మిచెల్ స్టార్క్ రీఎంట్రీ ఆస్ట్రేలియాకి బలం చేసుకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆసీస్ బౌలర్ జోష్ హజల్‌వుడ్...

‘పింక్ బాల్‌తో స్టార్క్ రికార్డుల గురించి అందరికీ తెలుసు. అతని రాక ఆసీస్‌కి కొండంత బలం. అతన్ని సాదరంగా ఆసీస్ జట్టులోకి తిరిగి ఆహ్వానిస్తున్నాం...’ అంటూ తెలిపాడు హజల్‌వుడ్.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్... మొదటి టెస్టుకి అందుబాటులో ఉండబోతున్నాడు... ఇదీ కూడా ఆసీస్‌కి బోనస్‌ కాబోతోంది.

మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన కామెరూన్ గ్రీన్, బౌలింగ్‌లో వికెట్లు కూడా తీశాడు. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో గాయపడిన గ్రీన్... ప్రస్తుతం నిలకడగా కోలుకుంటున్నాడట.

అలాగే రెండో వన్డేలో గాయపడి మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్, మొదటి టెస్టుకి దూరమైన డేవిడ్ వార్నర్, రెండో టెస్టు నాటికి కోలుకునే అవకాశం ఉంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?