బ్రిస్బేన్‌లో బిగ్ ఫైట్: భారత జట్టు నుంచి ఇద్దరు ఔట్.. కంగారెత్తిస్తారా?
IND vs AUS: అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత క్రికెట్ జట్టు బ్రిస్బేన్‌లో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. భారత జట్టుతో పాటు ఆసీస్ జట్టులో కూడా మార్పులు కనిపించనున్నాయి.

Cricket, India, IND vs AUS, Team india,
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో రెండు టెస్టుల తర్వాత 1-1తో సమమైంది. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే, తొలి టెస్టులో రికార్డు విజయాన్ని అందుకున్న భారత జట్టు మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి రావాలని చూస్తోంది.
భారతదేశం vs ఆస్ట్రేలియా 3వ టెస్టు డిసెంబర్ 14 నుంచి 18 వరకు బ్రిస్బేన్‌లో జరగనుంది. సిరీస్ లో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ ముందంజ వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికకు కొత్త రూపాన్ని ఇవ్వనుంది.
ఓపెనింగ్‌లోకి రోహిత్ శర్మ?
భారత్ బ్యాటింగ్ లైనప్‌లో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండవని భావిస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ స్లాట్‌ను వెనక్కి తీసుకోవచ్చు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చు. ఓపెనింగ్ లో రోహిత్ మెరుగైన రికార్డుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవచ్చు. శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో, రన్ మిషన్ విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రానున్నారు. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ఐదో నంబర్‌లో ఆడే అవకాశముంది.
Cricket, India, IND vs AUS, Team india,
హర్షిత్ రానా ఔట్ అవుతాడా?
రిషబ్ పంత్ వికెట్ కీపర్ పాత్రతో ఆరో నంబర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఏడో నంబర్‌లో ఆడవచ్చు. అయితే, భారత బౌలింగ్ లైనప్‌లో కొన్ని మార్పులు కనిపించవచ్చు. సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని రవీంద్ర జడేజా భర్తీ చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ రావచ్చు. అడిలైడ్ టెస్టులో అశ్విన్ పెద్దగా రాణించలేకపోయాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన హర్షిత్ రాణా అడిలైడ్‌లో తన ఫామ్‌ను పునరావృతం చేసేందుకు కష్టపడుతున్నాడు. మ్యాచ్ మొత్తంలో చాలా పరుగులు ఇచ్చి వికెట్లు కూడా తీయలేకపోయాడు. దీంతో అతని స్థానంలో ఆకాష్ దీప్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశముంది.
భారత్ ప్లేయింగ్-11 అంచనా జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా జట్టులోకి స్టార్ బౌలర్
సైడ్ స్ట్రెయిన్ కారణంగా రెండో టెస్టుకు దూరమైన జోష్ హేజిల్‌వుడ్ ఆస్ట్రేలియా జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. హేజిల్‌వుడ్ కోలుకుంటున్నట్లు కెప్టెన్ పాట్ కమిన్స్ వెల్లడించాడు. అయితే, అడిలైడ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన స్కాట్ బోలాండ్‌ను హేజిల్‌వుడ్ స్థానంలో జట్టులోకి తీసుకునే అవకాశం తక్కువే. మిగిలిన ఆస్ట్రేలియా జట్టులో ఎలాంటి మార్పులు లేనట్టే. ఉస్మాన్ ఖవాజా-నాథన్ మెక్‌స్వీనీ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో ఉంటారు.
ఆస్ట్రేలియా ప్లేయింగ్-11 అంచనా జట్టు
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్.