MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా కప్‌కి ముందు పాక్‌కి దిమ్మతిరిగే షాక్... గాయంతో షాహీన్ ఆఫ్రిదీ అవుట్...

ఆసియా కప్‌కి ముందు పాక్‌కి దిమ్మతిరిగే షాక్... గాయంతో షాహీన్ ఆఫ్రిదీ అవుట్...

ఆసియా కప్ 2022 టోర్నీ కోసం అటు పాకిస్తాన్, ఇటు టీమిండియా పూర్తి అస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. అయితే ఆసియా కప్‌కి ముందు గాయంతో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా మిస్ అయిన విషయం తెలిసిందే. బుమ్రాతో పాటు హర్షల్ పటేల్ కూడా గాయంతో ఆసియా కప్‌కి దూరం కావడంతో టీమిండియాకి భారీ నష్టం చేకూరినట్టైంది... తాజాగా దాయాది పాకిస్తాన్‌కి కూడా ఇలాగే పరిస్థితే ఎదురైంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 20 2022, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదీ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది పాకిస్తాన్. ఈ సిరీస్‌లో గాయపడిన షాహీన్ ఆఫ్రిదీ... ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి కూడా దూరమయ్యాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Shaheen Afridi

Shaheen Afridi

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చాడు షాహీన్ ఆఫ్రిదీ. ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన షాహీన్ ఆఫ్రిదీ, ఆ తర్వాతి ఓవర్‌లో కెఎల్ రాహుల్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు... ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ కూడా షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

37

వరుస వికెట్లు కోల్పోయిన భారత జట్టు భారీ స్కోరు చేయలేక 151 పరుగులకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించి, ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారత్‌పై విజయాన్ని అందుకుంది... భారత టాప్ బ్యాటర్లను అవుట్ చేశాననే గర్వంతో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఎలా అవుట్ అయ్యింది ఇమిటేట్ చేస్తూ హేళన చేశాడు షాహిన్ ఆఫ్రిదీ.

47

అయితే ఈసారి భారత్- పాక్ మ్యాచ్‌లో షాహిన్ ఆఫ్రిదీ ఆడడం లేదు. ఇది కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా ఆసియా కప్ 2022 టోర్నీకి విడుదల చేసిన ప్రోమోలో షాహిన్ ఆఫ్రిదీ బౌలింగ్ ఛాలెంజ్‌ గురించి కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...

57

పాత బాకీ ఇంకా మిగిలే ఉందని ఆఫ్రిదీ బౌలింగ్ గురించి వ్యాఖ్యానించాడు. ఈసారి ఆసియా కప్ 2022లో షాహిన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ బౌండరీల మోత మోగిస్తుంటే చూడాలని ఆశపడ్డారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్. అయితే ఈసారి ఆ అవకాశం లేనట్టే...

67

భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయపడి, ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైనప్పుడు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ నవ్వుతూ ట్రోల్స్ చేశారు. ఇది జరిగిన నెల రోజులకే పాక్ టీమ్ స్టార్ బౌలర్ గాయంతో ఆసియా కప్ టోర్నీకి దూరం కావడం కొసమెరుపు... 

77
shaheen afridi

shaheen afridi

ఇటు భారత జట్టు స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, అటు పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదీ లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీ జరగనుంది. ఈ ఇద్దరూ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ వరకూ కోలుకుని ఫిట్‌గా ఉండాలని ఇప్పటి నుంచే ప్రార్థనలు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Harmanpreet Kaur Net Worth: ఒక్కో సీజన్‌కు కోట్లలో సంపాదన.. హర్మన్‌ప్రీత్ కౌర్ నెట్‌వర్త్ ఎంత?
Recommended image2
Harmanpreet Kaur: బిగ్ షాక్.. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్ కౌర్
Recommended image3
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కు బిగ్ షాక్.. తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved