MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 : స్వింగ్ కింగ్ ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లో భువనేశ్వర్ వరల్డ్ రికార్డ్.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్?

IPL 2026 : స్వింగ్ కింగ్ ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లో భువనేశ్వర్ వరల్డ్ రికార్డ్.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్?

Bhuvneshwar Kumar: ఐపీఎల్ 2026లో భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించారు. లసిత్ మలింగ రికార్డును బ్రేక్ చేస్తూ దుమ్మురేపాడు. గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా నిలిచారు. టీమిండియాలోకి రీఎంట్రీ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 11 2026, 09:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీమిండియా సెలెక్టర్ల మైండ్ బ్లాక్.. భువనేశ్వర్ వికెట్ల వేట చూశారా?
Image Credit : ANI

టీమిండియా సెలెక్టర్ల మైండ్ బ్లాక్.. భువనేశ్వర్ వికెట్ల వేట చూశారా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో టీమిండియా సీనియర్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకుని ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఒకప్పుడు భువీ పని అయిపోయిందని విమర్శించిన వాళ్లందరి నోళ్లు మూయిస్తూ, మైదానంలో వికెట్లతో సమాధానం చెబుతున్నాడు.

ఈ సీజన్‌లో వరుసగా రికార్డులను బద్దలు కొడుతున్న భువీ, తాజాగా లెజెండరీ బౌలర్ లసిత్ మలింగ పేరు మీద ఉన్న ఒక బిగ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రదర్శన చూస్తుంటే భువనేశ్వర్ త్వరలోనే మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించడం ఖాయమనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మలింగ రికార్డ్ బద్దలు.. భువీ సరికొత్త చరిత్ర
Image Credit : ANI

మలింగ రికార్డ్ బద్దలు.. భువీ సరికొత్త చరిత్ర

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ ఉండేవాడు. కానీ తాజాగా రాయ్‌పూర్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ ఈ రికార్డును తిరగరాశాడు. ఐపీఎల్‌లో తన జట్టు విజయం సాధించిన మ్యాచ్‌ల్లో భువీ ఇప్పటివరకు మొత్తం 126 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు మలింగ 122 వికెట్లతో టాప్‌లో ఉండగా, ఇప్పుడు భువీ అతన్ని వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొదటి పేసర్‌గా భువనేశ్వర్ నిలిచాడు.

35
బుమ్రా కంటే చాలా ముందున్న భువీ
Image Credit : ANI

బుమ్రా కంటే చాలా ముందున్న భువీ

ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్‌గా పేరున్న జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ రికార్డు విషయంలో భువనేశ్వర్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. గెలిచిన మ్యాచ్‌ల్లో బుమ్రా ఇప్పటివరకు 116 వికెట్లు మాత్రమే తీశాడు. భువీ (126), మలింగ (122) తర్వాత బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక వీరి తర్వాత వరుసలో డ్వేన్ బ్రావో (115 వికెట్లు), మోహిత్ శర్మ (101 వికెట్లు) టాప్-5లో కొనసాగుతున్నారు. వికెట్లు తీయడమే కాదు, జట్టును గెలిపించడంలో తన పాత్ర ఎంత కీలకమో భువీ మరోసారి నిరూపించుకున్నాడు.

45
ముంబై ఇండియన్స్‌పై స్వింగ్ మ్యాజిక్
Image Credit : Instagram/royalchallengers.bengaluru + X/@rend_VKohli

ముంబై ఇండియన్స్‌పై స్వింగ్ మ్యాజిక్

ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో భువనేశ్వర్ కుమార్ క్లాసిక్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 4 వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్ నడ్డి విరిచాడు. ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక వికెట్లు ఉండటం విశేషం. ఈ అద్భుతమైన స్పెల్‌తో తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్వింగ్‌ను నమ్ముకుని బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంలో భువీని మించిన వారు లేరని ఈ మ్యాచ్ మరోసారి చాటిచెప్పింది.

55
పర్పుల్ క్యాప్ రేసులో నంబర్ వన్
Image Credit : RCB

పర్పుల్ క్యాప్ రేసులో నంబర్ వన్

ఐపీఎల్ 2026లో భువనేశ్వర్ జోరు చూస్తుంటే ముచ్చటగా మూడోసారి పర్పుల్ క్యాప్ అందుకునేలా ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో భువీ 21 వికెట్లు పడగొట్టి, టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

ప్రస్తుతం పర్పుల్ క్యాప్ భువీ దగ్గరే ఉంది. 2016, 2017 సీజన్లలో వరుసగా రెండుసార్లు పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక భారతీయ పేసర్‌గా భువీకి రికార్డు ఉంది. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఈ స్థాయి ప్రదర్శన తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ ఖాయమని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
5 Most Dangerous Batsmen: క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు వీరే.. క్రీజులోకి వస్తే బౌలర్లకు వణుకే!
Recommended image2
Team India: సూర్యకు షాక్.. అయ్యర్ కాదు.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజూ? సెలక్టర్ల ప్లాన్ ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved