నా వల్లే యాషస్ సిరీస్ ఓడిపోయాం, ఈసారి అలా జరగనివ్వను... బెన్ స్టోక్స్ కామెంట్...
భారీ అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు 4-0 తేడాతో ఘోర పరాభవాన్ని చవి చూసింది. ఒకే ఒక్క మ్యాచ్‌ను, అదీ కూడా ఆఖరి వికెట్‌ను అతి కష్టం మీద కాపాడుకుని డ్రా చేసుకున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో చిత్తుగా ఓడింది...

మెంటల్ హెల్త్ కోసం నాలుగు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, యాషెస్ సిరీస్ ద్వారానే రీఎంట్రీ ఇచ్చాడు...
టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి అందుబాటులో లేని బెన్ స్టోక్స్, యాషెస్ సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చినా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...
యాషెస్ సిరీస్ 2021-22 టోర్నీలో 236 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, బంతితోనూ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. ఐదు మ్యాచుల్లో కలిపి కేవలం 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు...
బెన్ స్టోక్స్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌ని, ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచిన ఈ ఆల్‌రౌండర్, ఇకపై అలా జరగదంటున్నాడు...
వెస్టిండీస్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌కి సిద్ధమవుతున్న ఇంగ్లాండ్ క్రికెట్ స్టార్ ఆల్‌రౌండర్, ఈసారి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు...
‘ఆస్ట్రేలియా పర్యటనలో మేం చాలా ఇబ్బందులు పడ్డాం. జట్టుగా రాణించలేకపోవడమే కాదు, వ్యక్తిగతంగానూ మెరుగైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాం...
పర్ఫామెన్స్‌ల కంటే ముఖ్యంగా ఆసీస్ టూర్‌లో మేం బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాం. నేను ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లినప్పుడు ఫిజికల్‌గా ఫిట్‌గా లేను...
ఇంతకుముందెప్పుడూ ఆ రకంగా ఫీల్ అవ్వలేదు. యాషెస్ సిరీస్‌లో మానసికంగా, శారీరకంగా ఇబ్బందిపడుతూనే పాల్గొన్నాను...
అయితే ఇప్పుడు చాలా క్లీన్‌గా ఉన్నా. గతంలోకి వెళ్లి జరిగినదాన్ని మార్చలేను. అయితే టీమ్‌కి నా నుంచి ఏం కావాలో నాకు బాగా తెలుసు...
యాషెస్ సిరీస్‌లో నా పర్ఫామెన్స్‌పై నాకే సంతృప్తి లేదు. ఈసారి మాత్రం అలా జరగనివ్వను...’ అంటూ కామెంట్ చేశాడు బెన్ స్టోక్స్...
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌లోనే గాయపడిన బెన్ స్టోక్స్, వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2022 సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు...