- Home
- Sports
- Cricket
- భారత క్రికెటర్‌గా ఉండడం చాలా కష్టం! 8 ఏళ్లలో 12 మ్యాచులే ఆడా... సంజూ శాంసన్ షాకింగ్ కామెంట్స్..
భారత క్రికెటర్‌గా ఉండడం చాలా కష్టం! 8 ఏళ్లలో 12 మ్యాచులే ఆడా... సంజూ శాంసన్ షాకింగ్ కామెంట్స్..
టన్నుల్లో టాలెండ్ ఉన్నా, నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోవడం, బీసీసీఐ రాజకీయాలు, దక్షిణాది ప్లేయర్ కావడం... ఇలా సంజూ శాంసన్, టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోవడానికి కారణాలు ఎన్నో...

ధోనీ రిటైర్మెంట్ తర్వాత రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇచ్చి, ప్రొత్సహించిన టీమిండియా మేనేజ్‌మెంట్, సంజూ శాంసన్‌కి అరకోర అవకాశాలు మాత్రమే ఇచ్చింది. వచ్చిన అవకాశాలను వాడుకోవడంలో సంజూ శాంసన్ విఫలమయ్యాడు..
Sanju Samson
గత ఏడాది వన్డేల్లో 60+ సగటుతో పరుగులు చేసినప్పటికీ, వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సంజూ శాంసన్‌కి చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్‌కి మూడు వన్డేల్లోనూ చోటు ఇచ్చిన మేనేజ్‌మెంట్, సంజూని రెండు వన్డేల్లో ఆడించింది...
Sanju Samson
రెండో వన్డేలో 9 పరుగులు చేసి అవుటైన సంజూ శాంసన్, మూడో వన్డేలో 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 11 వన్డేల్లో సంజూ శాంసన్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ...
‘మిడిల్ ఆర్డర్‌లో విలువైన సమయం గడపడం, కొన్ని పరుగులు చేయడం చాలా గొప్పగా అనిపించింది. ఒక్కో బౌలర్‌కి ఒక్కో రకమైన ప్లాన్స్ వేసుకుంటాను. బౌలర్ల లెంగ్త్‌ని తగ్గట్టుగా నా బ్యాటింగ్ స్టైల్ మారుతుంటుంది..
భారత క్రికెటర్‌గా ఉండడం చాలా కష్టమైన విషయం. నేను దాదాపు 10 ఏళ్లుగా దేశవాళీ టోర్నీలు ఆడుతున్నా. ఇప్పటిదాకా 10-12 అంతర్జాతీయ మ్యాచులే ఆడాను. అయితే దేశవాళీ అనుభవం కారణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ పొజిషన్‌లో ఆడడానికి కావాల్సిన అవగాహన వచ్చింది..
Sanju Samson
నేను ఎప్పుడు బ్యాటింగ్‌కి వచ్చినా ఏ పొజిషన్ అనే విషయాన్ని పట్టించుకోను, ఎన్ని ఓవర్లు ఉన్నాయి, ఎన్ని ఓవర్లు ఆడాలనే ఆలోచనతోనే గ్రౌండ్‌లోకి వస్తా.. బౌలర్ ఎవ్వరైనా అటాక్ చేయాలనే ఫిక్స్ అయ్యాకే బ్యాటింగ్‌కి దిగుతాను..’ అంటూ చెప్పుకొచ్చాడు సంజూ శాంసన్..