- Home
- Sports
- Cricket
- IPL2022: పనికిమాలిన కారణాలతో ఐపీఎల్ ను వీడే ఆటగాళ్లపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న బీసీసీఐ..?
IPL2022: పనికిమాలిన కారణాలతో ఐపీఎల్ ను వీడే ఆటగాళ్లపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న బీసీసీఐ..?
TATA IPL2022: ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. అయితే వేలంలో పేరు ఇచ్చి ఒక ఫ్రాంచైజీకి ఎంపికై ఆ తర్వాత కొంతమంది క్రికెటర్లు ఐపీఎల్ ను వీడుతున్నారు.

BCCI
ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకుని ఒక ఫ్రాంచైజీ సదరు క్రికెటర్ ను కొనుగోలు చేసిన తర్వాత తీరా లీగ్ కు ముందు సరైన కారణం చూపకుండా జట్టును వీడే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సిద్ధమవుతున్నదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
IPL
వేలంలో ఎంపికై ఆ తర్వాత పనికిమాలిన కారణాలతో ఐపీఎల్ ను వీడుతున్న క్రికెటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయా ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి చర్చలు జరుపుతున్నది.
Jason Roy
ఐపీఎల్ ప్రారంభానికి ముందు వేలంలో దక్కించుకున్న ఇంగ్లాండ్ ఆటగాడు జేసన్ రాయ్ (గుజరాత్ టైటాన్స్) తో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు అలెక్స్ హేల్స్ లు తమ జట్లను వీడిన విషయం తెలిసిందే.
Hales
బయో బబుల్ కారణాన్ని చూపి ఈ ఇద్దరూ లీగ్ నుంచి వైదొలిగారు. ఇక మరోవైపు మరో ఇంగ్లాండ్ ఆటగాడు, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఎంపికైన మార్క్ వుడ్ కూడా గాయంతో లీగ్ నుంచి తప్పుకున్నాడు.
BCCI
ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు బీసీసీఐ ముందు తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నాయి. ఇలా లీగ్ ను మధ్యలో వదిలేసి వెళ్లే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ లో ముఖ్యమైన వాటాదారులైన ఫ్రాంచైజీలే పట్ల మేం పూర్తి నిబద్ధత కలిగి ఉంటాం. వేలంలో చాలా ప్రణాళికలు వేసుకుని వాళ్లు ఒక ఆటగాడి కోసం వేలం వేస్తారు.
alex hales
అయితే తీరా ఆ ఆటగాడు చివరికి హ్యాండ్ ఇస్తే వాళ్ల ప్రణాళికలన్నీ తలకిందులవుతాయి. సరైన కారణాలు చూపకుండానే ఆటగాళ్లు వైదొలుగుతుండటం ఆందోళనకరం. ఐపీఎల్ నుంచి వైదొలిగే ఆటగాళ్లను నిర్దిష్ట సంవత్సరాల పాటు ఆడకుండా నిరోధించాలనే స్వీపింగ్ విధానమేదీ ప్రస్తుతం లేదు. దీని మీద కాస్త చర్చలు జరపాల్సి ఉంది. సరైన కారణం చూపకుండా ఐపీఎల్ లీగ్ నుంచి వైదొలిగే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాలక మండలి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది...’ అని తెలిపాడు.
Alex Hales
ఇటీవలే ముగిసిన వేలం ప్రక్రియలో జేసన్ రాయ్ ను జీటీ రూ. 2 కోట్లతో దక్కించుకుంది. మరోవైపు అలెక్స్ హేల్స్ ను కోల్కతా రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే వేలంలో తమకు అనుకూల ధర రాలేదనే కారణంతోనే ఈ ఇద్దరు ఆటగాళ్లు వైదొలిగినట్టు ఆరోపణలున్నాయి. మరోవైపు మార్క్ వుడ్ ను లక్నో రూ. 7.25 కోట్లకు దక్కించుకుంది. అతడు గాయం కారణంగా వైదొలిగాడు. ఈ ముగ్గురూ ఇంగ్లాండ్ ఆటగాళ్లే కావడం గమనార్హం.