కరోనాపై పోరాటానికి మరోసారి బీసీసీఐ భారీ సాయం... ఆక్సిజన్ కొరతతో బాధపడేవారికి తక్షణసాయంగా...

First Published May 24, 2021, 3:51 PM IST

కరోనా వైరస్‌పై పోరాటానికి సాయంగా గత ఏడాది 51 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయం చేసిన భారత క్రికెట్ బోర్డు, మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. దేశంలో కరోనా బారిన పడి ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో బాధపడుతున్నవారికి సాయంగా 2 వేల ఆక్సిజన్ కాన్సంటేటర్లు (ఒక్కోటి 10 లీటర్ల కెపాసిటీ) విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించింది.