- Home
- Sports
- Cricket
- Jay Shah: ఎప్పటికీ చెరగని స్ఫూర్తిని.. టీమిండియా ఓటమిపై బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు
Jay Shah: ఎప్పటికీ చెరగని స్ఫూర్తిని.. టీమిండియా ఓటమిపై బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు
ICC Cricket World Cup 2023: ఫైనల్ లో భారత్ ఓటమిపై జైషా స్పందిస్తూ.. "విజయం నుంచి కష్టాల వరకు ప్రతి మ్యాచ్ మా జట్టు అచంచల స్ఫూర్తికి, సంకల్పానికి, నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఫైనల్స్ కు ముందు జరిగిన 10 మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి, క్రికెట్ నిజమైన సారాన్ని ప్రదర్శించారని" అన్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Jay Shah
World Cup 2023: ఐసీసీ ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన క్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జై షా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా స్పదించిన జై షా.. భారత జట్టు ట్రోఫీని గెలవడంలో విఫలమైనప్పటికీ, వారు చెరగని స్ఫూర్తిని మిగిల్చారనీ, ప్రపంచకప్ మొత్తంలో టీమిండియా ప్రబలమైన శక్తి నిలిచిందని పేర్కొన్నారు.
అలాగే, ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ మెన్ ఇన్ బ్లూ విఫలమైనప్పటికీ, వారి ప్రయాణం చెరగని స్ఫూర్తిని మిగిల్చింది. విజయం నుంచి కష్టాల వరకు ప్రతి మ్యాచ్ మా జట్టు అచంచల స్ఫూర్తికి, సంకల్పానికి, నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఫైనల్స్ కు ముందు జరిగిన 10 మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి.. క్రికెట్ నిజమైన సారాన్ని ప్రదర్శించింది. అలాగే, అందమైన ఆటతో పాటు అసలు సిసలైన మజాను అందించిన ఆటను చూపించారని కొనియాడారు.
యావత్ భారతావని మన కుర్రాళ్లకు అండగా నిలిచి, ఈ ప్రపంచ కప్ ను భారత్ లో క్రికెట్ కు దేశవ్యాప్త వేడుకగా మార్చిందన్నారు. మొత్తం ప్రజల శక్తి, అభిరుచి.. అలుపెరగని మద్దతు నిజంగా నమ్మశక్యం కానివని పేర్కొన్నారు.
అలాగే, టీమ్ఇండియాలోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అంకితభావం, కృషి, పట్టుదల ఈ టోర్నమెంట్ అంతటా స్వచ్ఛమైన ఆనంద క్షణాలను అందించాయి. మీరు మీ విజయాలతోనే కాకుండా, ఆటను ఆడిన విధానంతో - హృదయంతో.. గర్వంతో.. ఎన్నడూ మర్చిపోని దృక్పథంతో మమ్మల్ని గర్వపడేలా చేశారని జై షా వివరించారు.
ఈ ప్రపంచకప్ కేవలం విజయాలకే పరిమితం కాలేదని పేర్కొన్న జై షా.. ఇది టీమిండియా భావోద్వేగాలు, స్నేహం, తిరుగులేని స్ఫూర్తిని రగిల్చినవని అన్నారు.
Team India
"ఆనందానికి, మరపురాని క్షణాలను మిగిల్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మెన్ ఇన్ బ్లూ - అన్ని విధాలుగా నిజమైన ఛాంపియన్లు. ఈ ప్రపంచ కప్ ప్రయాణం ముగిసి ఉండవచ్చు, కానీ మా జట్టు పట్ల గర్వం.. ప్రేమ.. స్ఫూర్తి ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయని" అన్నారు.