- Home
- Sports
- Cricket
- చేయాల్సినంతా చేశాడు, ఇక తప్పుకుంటున్నాడు... సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు...
చేయాల్సినంతా చేశాడు, ఇక తప్పుకుంటున్నాడు... సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు...
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ తనదైన మార్కు వేశాడు. అక్టోబర్ 2019లో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న గంగూలీ, త్వరలో ఆ పదవి నుంచి తప్పుకోబోతున్నాడు... అక్టోబర్ 2022లో బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడని టాక్...

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలం అక్టోబర్ 2022తో ముగియనుంది. ఇప్పటికే రెండేళ్లకు పైగా చట్టవిరుద్ధంగా ఆ పదవిలో కొనసాగుతున్న గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జై షా... అక్టోబర్‌లో తమ కుర్చీలను ఖాళీ చేయనున్నారు...
2019లో అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ (సీఓఏ)ని నియమించి, బీసీసీఐ కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చింది. రాజ్యాంగంలో చేసిన మార్పుల ప్రకారం భారత క్రికెట్‌లో ఏ పదవిలో ఉన్న అధికారులైనా రెండు సార్లు మాత్రమే (ఒక్కోసారి మూడేళ్ల చొప్పున ఆరేళ్ల పాటు) అధికారం స్వీకరించడానికి అవకాశం ఉంటుంది...
అంటే బీసీసీఐలో ఏదైనా అధికారం స్వీకరించిన వ్యక్తి, ఆరేళ్ల పాటు మాత్రమే బోర్డులో పదవిని అనుభవించడానికి ఉంటుంది. ఉదాహరణకు బెంగాల్ క్రికెట్ అకాడమీకి ప్రెసిడెంట్‌గా ఐదేన్నరేళ్లు పనిచేసిన గంగూలీ, బీసీసీఐ ప్రెసిడెంట్‌గా పదవి స్వీకరిస్తే ఆరు నెలల్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందే...
అక్టోబర్ 2019లో బీసీసీఐ బోర్డు ద్వారా ప్రెసిడెంట్‌గా సౌరవ్ గంగూలీ, సెక్రటరీగా జై షా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడుు వీరి పదవీకాలం కేవలం ఆరు నెలల మాత్రమే... 2020 జూలై 27తో సౌరవ్ గంగూలీ, బీసీసీఐలో ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోగా, జై షా ఆరేళ్ల పదవీకాలం ముగించుకుని చాలా రోజులే అవుతోంది.
అయితే రెండేళ్లుగా తమ తమ పదవుల్లో బీసీసీఐ చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న ఈ ఇద్దరూ బీసీసీఐలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలో వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.
ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతున్న సమయంలో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించింది బీసీసీఐ. ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అయ్యింది...
అయితే స్వదేశంలో నిర్వహించిన ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో కరోనా కేసులు వెలుగుచూశాయి. రెండు ఫేజ్‌లుగా ఐపీఎల్‌ను పూర్తి చేయడంలో సక్సెస్ సాధించింది బీసీసీఐ...
కరోనా కేసుల కారణంగా భారత్ వేదికగా జరగాల్సిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహించింది బీసీసీఐ..
అలాగే ఐపీఎల్ 2022 సీజన్‌ను 10 జట్లతో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న గంగూలీ కారణంగా బీసీసీఐకి రూ.12 వేల కోట్లకు పైగా అదనపు ఆదాయం చేకూరింది. ఐపీఎల్ ప్రసార హక్కుల రూపంలో మరో రూ.35 వేల కోట్లు రానుంది...
బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సౌరవ్ గంగూలీ తనదైన ముద్ర వేసుకున్నా, కేంద్ర మంత్రి అమిత్ షా కొడుకు జై షా సెక్రటరీ హోదాలో ఉండడంతో దాదా నిర్ణయాలపై రాజకీయాల మార్కు వేశారు విరాట్ కోహ్లీ అభిమానులు...