- Home
- Sports
- Cricket
- BCCI: టెండర్ విడుదలైంది.. ఇక ధన ప్రవాహమే.. మీడియా హక్కుల ద్వారా భారీగా ఆశిస్తున్న బీసీసీఐ
BCCI: టెండర్ విడుదలైంది.. ఇక ధన ప్రవాహమే.. మీడియా హక్కుల ద్వారా భారీగా ఆశిస్తున్న బీసీసీఐ
BCCI-IPL Media Rights: భారత క్రికెట్ కు కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ-టెండర్ విడదుల చేసింది.

బీసీసీఐకి కామధేనువుగా మారిన ఐపీఎల్ మీడియా హక్కుల కోసం టెండర్ విడుదలైంది. మంగళవారం బీసీసీఐ.. ఈ-టెండర్ ప్రక్రియను విడుదల చేసింది.
రాబోయే ఐదేండ్ల (2023-2027) కాలానికి గాను బీసీసీఈ ఈ-టెండర్ ప్రకటనను జారీ చేసింది. ప్రస్తుతం బీసీసీఐ అధికారిక స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న స్టార్ స్పోర్ట్స్ తో ఒప్పందం ఈ ఏడాదికి ముగియనుంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ.. తాజాగా మీడియా హక్కుల టెండర్ ను విడుదల చేసింది. కాగా ఈ టెండర్ల ద్వారా రూ. 50 వేల కోట్లను బీసీసీఐ ఆశిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కు ఉన్న క్రేజ్.. ఐపీఎల్ పరిధి పెరిగిన నేపథ్యంలో మీడియా హక్కులను ఎంతైనా పెట్టి దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
రెండు కొత్త జట్లు రావడం.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ గతంతో పోల్చితే దాదాపు పదింతలు పెరగడం.. ఫ్రాంచైజీలు భారీ గా డబ్బులు ఖర్చు చేసి ఆటగాళ్లను దక్కించుకుంటడం.. ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచుతున్నది ఐపీఎల్.
ఈ నేపథ్యంలో జీ-సోనీ తో పాటు రిలయన్స్, అమెజాన్ ప్రైమ్ వంటి బడా సంస్థలు కూడా వీటిని దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఈ మేరకు అవి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాయి.
కాగా.. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్ నుంచి బీసీసీఐ ఈ-వేలం ను నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.