MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • టీమిండియాకు కొత్త స్పాన్సర్.. గట్టి కండీషన్లు పెట్టిన బీసీసీఐ

టీమిండియాకు కొత్త స్పాన్సర్.. గట్టి కండీషన్లు పెట్టిన బీసీసీఐ

Team India : డ్రీమ్11 వెనక్కి తగ్గడంతో బీసీసీఐ భారత జట్టుకు కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు ఆహ్వానించింది. రూ.300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే అర్హత ఉంటుందని పలు కండీషన్లు పెట్టింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 02 2025, 09:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
డ్రీమ్11 ఎగ్జిట్‌తో భారత జట్టు స్పాన్సర్ ఖాళీ
Image Credit : Getty

డ్రీమ్11 ఎగ్జిట్‌తో భారత జట్టు స్పాన్సర్ ఖాళీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి స్పాన్సర్‌షిప్ మార్పుకు సిద్ధమైంది. అన్ లైన్ గేమింగ్ పై ప్రభుత్వం ఇటీవలే చట్టం తీసుకురావడంతో ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11 తన ఒప్పందాన్ని బీసీసీఐతో ముందుగానే ముగించుకుంది. 2025లో అమల్లోకి వచ్చిన కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం రియల్ మనీ గేమింగ్ కంపెనీలకు క్రీడా ఈవెంట్ల స్పాన్సర్‌షిప్‌ను నిషేధించింది. 

అలాగే, మనీ సంబంధిత అన్ని అన్ లైన్ గేమ్స్ పై నిషేధం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ 2025 సమీపిస్తున్న తరుణంలో, బీసీసీఐ వెంటనే కొత్త స్పాన్సర్ కోసం టెండర్ విడుదల చేసింది.

DID YOU
KNOW
?
బీసీసీఐ ఏర్పాటు
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) డిసెంబర్ 1928లో ఏర్పడింది. భారత క్రికెట్‌ను నిర్వహించేందుకు మద్రాస్‌లోని (ప్రస్తుత చెన్నై) ఒక సమావేశంలో దీనిని స్థాపించారు. దీనికి రిజిస్ట్రేషన్ జనవరి 1929లో జరిగింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టీమిండియా కొత్త స్పాన్సర్ - టెండర్ షరతులు మరింత కఠినం
Image Credit : Getty

టీమిండియా కొత్త స్పాన్సర్ - టెండర్ షరతులు మరింత కఠినం

టీమిండియా కొత్త స్పాన్సర్ కోసం మంగళవారం (సెప్టెంబర్ 2న) బీసీసీఐ ఇన్విటేషన్ ఫర్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (IEOI) విడుదల చేసింది. అయితే ఈ సారి షరతులు కఠినంగా ఉన్నాయి. కనీసం మూడు సంవత్సరాలుగా రూ.300 కోట్ల టర్నోవర్ లేదా నికర విలువ చూపించగలిగిన సంస్థలకే అర్హత ఉంటుంది. అలాగే నేర చరిత్ర, ఆర్థిక వివాదాలు లేదా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఉన్న సంస్థలను తిరస్కరించే హక్కు బోర్డుకే ఉంటుందని స్పష్టంచేసింది.

36
షరతులలో పలు నిషేధిత కేటగిరీలు
Image Credit : Getty

షరతులలో పలు నిషేధిత కేటగిరీలు

బీసీసీఐ స్పాన్సర్‌గా బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ మనీ గేమింగ్, క్రిప్టోకరెన్సీ, పొగాకు, మద్యం రంగాలకు చెందిన కంపెనీలు అర్హులు కావు. ఇదే కాకుండా ప్రాక్సీ బ్రాండ్ల ద్వారా దరఖాస్తులు పంపడం కూడా అనుమతిలేదు. 

నిషేధిత రంగాల వివరాలు..

  • మద్యం ఉత్పత్తులు
  • బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ సేవలు
  • క్రిప్టోకరెన్సీ వ్యాపారం
  • ఆన్‌లైన్ మనీ గేమింగ్
  • పొగాకు రంగం
46
టీమిండియా కొత్త స్పాన్సర్ – ఫీజులు, టైమ్‌లైన్
Image Credit : Getty

టీమిండియా కొత్త స్పాన్సర్ – ఫీజులు, టైమ్‌లైన్

టెండర్ డాక్యుమెంట్ పొందడానికి రూ.5 లక్షల (జీఎస్టీతో కలిపి) చెల్లించాలి. ఆసక్తి గల సంస్థలు సెప్టెంబర్ 12లోపు బిడ్ డాక్యుమెంట్ కొనుగోలు చేయాలి. తుది దరఖాస్తు సెప్టెంబర్ 16లోపు సమర్పించాలి. ఈ షెడ్యూల్ ప్రకారం, బోర్డుకు కొత్త స్పాన్సర్‌ను ఫైనల్ చేసే సమయం తక్కువే. ఆలస్యం జరిగితే, ఆసియా కప్‌లో భారత జట్టు స్పాన్సర్ లేకుండా ఆడే అవకాశం కూడా ఉంది.

56
డ్రీమ్11 ఒప్పందం రద్దు
Image Credit : Getty

డ్రీమ్11 ఒప్పందం రద్దు

డ్రీమ్11 బీసీసీఐతో 2023లో 358 కోట్ల రూపాయల (సుమారు US$44 మిలియన్) విలువైన ఒప్పందం చేసుకుంది. ఇది 2026 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే కొత్త చట్టం వల్ల ఇది ముందుగానే ముగిసింది. 

డ్రీమ్11, మై11సర్కిల్ అనే మరో ఫాంటసీ ప్లాట్‌ఫామ్ కలిసి అన్ని ఒప్పందాలతో ఇప్పటి వరకు దాదాపు రూ.1000 కోట్లు బీసీసీఐకి అందించాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

66
భారత క్రికెట్ స్పాన్సర్‌షిప్‌లో మారుతున్న దృశ్యం
Image Credit : Getty

భారత క్రికెట్ స్పాన్సర్‌షిప్‌లో మారుతున్న దృశ్యం

ఈ పరిణామం భారత క్రికెట్‌లో స్పాన్సర్‌షిప్ డైనమిక్స్ ఎంత వేగంగా మారుతున్నాయో చూపిస్తుంది. డ్రీమ్11 వెనక్కితగ్గడంతో ఫాంటసీ స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌కు ముగింపు కార్డు పడింది. అదే సమయంలో పెద్ద బ్రాండ్లకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి.

టీమిండియాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా, ప్రధాన స్పాన్సర్ హక్కులు ఇప్పటికీ అత్యంత కోవేటెడ్ మార్కెటింగ్ స్లాట్ గా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో టీమిండియా కొత్త స్పాన్సర్ ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
జోస్ బట్లర్ నుంచి రిషబ్ పంత్ వరకు: 2025లో టాప్ 10 వికెట్ కీపర్లు
Recommended image2
మిచెల్ స్టార్క్ ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved