జోస్ బట్లర్ నుంచి రిషబ్ పంత్ వరకు: 2025లో టాప్ 10 వికెట్ కీపర్లు
Top 10 Best Wicketkeepers: 2025లో ప్రపంచంలో టాప్ 10 వికెట్ కీపర్ల జాబితాలో జోస్ బట్లర్ నుంచి రిషబ్ పంత్ వరకు ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఈ లిస్టులోని ప్లేయర్ల వివరాలు మీకోసం.

టాప్ 10 వికెట్ కీపర్లు 2025
Top 10 Best Wicketkeepers 2025: క్రికెట్‌లో వికెట్ కీపర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ఒక్క అద్భుతమైన స్టంపింగ్ లేదా క్యాచ్‌తో వారు మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలరు. ప్రతి బంతిపై అప్రమత్తంగా ఉండే వికెట్ కీపర్లు బౌలర్లకు నమ్మకాన్ని, జట్టుకు రక్షణను అందిస్తారు. గ్లోవ్ వర్క్, రిఫ్లెక్సులు, అలాగే బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ ఆధారంగా 2025 లో టాప్ 10 వికెట్ కీపర్ల జాబితా ఇలా ఉంది..
KNOW
1. జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)
జోస్ బట్లర్ ఆధునిక వికెట్ కీపర్‌కు నిర్వచనంలాంటివాడు. స్టంపింగ్‌లలో అతని వేగం, కఠిన పరిస్థితుల్లో ప్రశాంతంగా నిలబడే తీరు అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. బ్యాటింగ్‌లో పవర్‌ఫుల్ హిట్టర్‌గా గుర్తింపు పొందాడు. టీ20ల్లో ఆరంభంలో లేదా ఫినిషర్‌గా అద్భుతంగా రాణిస్తాడు.
2. అలెక్స్ కేరీ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్స్ కేరీ సైలెంట్ గానే కనిపించినా విలువైన ఆటగాడు. అతని వికెట్ కీపింగ్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. టెస్టులు, వన్డేలలో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే సామర్థ్యం అతని ప్రత్యేకతగా చెప్పవచ్చు.
3. రిషబ్ పంత్ (భారత్)
రిషభ్ పంత్ కీపింగ్‌లో అద్భుతమైన పురోగతి సాధించాడు. స్పిన్నర్లకు స్టంప్‌ల వెనక చాలా వేగంగా కదలడం అతని ప్రత్యేక బలం. అలాగే, బ్యాటింగ్‌లో పంత్ ఆగ్రెసివ్ ఆటతో మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పే సత్తాను కలిగి ఉన్న ప్లేయర్. ఫార్మాట్ ఏదైనా సరే అద్భుతమైన ఆటను రిషబ్ పంత్ నుంచి చూడవచ్చు.
4. మహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)
రిజ్వాన్ శ్రద్ధ, క్రమశిక్షణతో గుర్తింపు సాధించాడు. లాంగ్ ఫార్మాట్‌లోనూ చాలా స్మార్ట్ గా కీపింగ్ చేస్తాడు. టీ20ల్లో ఇన్నింగ్స్‌ను స్థిరపరచే నమ్మకమైన బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు.
5. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా)
క్వింటన్ డి కాక్ సహజ ప్రతిభ కలిగిన వికెట్ కీపర్. అంతర్జాతీయ కెరీర్ ముగిసిన తర్వాత కూడా గ్లోబల్ టీ20 లీగ్‌లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. పవర్‌ప్లేలో అతని ఆగ్రెసివ్ బ్యాటింగ్ జట్టుకు ప్రారంభం నుంచే ఆధిక్యం అందిస్తుంది.
6. హెన్రిచ్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)
క్లాసెన్ సేఫ్ కీపర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ అతని ప్రధాన బలం బ్యాటింగ్. సిక్స్‌లతో మ్యాచ్‌ను కొన్ని ఓవర్లలోనే మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ప్లేయర్.
7. రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్)
ఈ యంగ్ ప్లేయర్ రిఫ్లెక్సులు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచాయి. గుర్బాజ్ బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తాడు. జట్టుకు మంచి ఆరంభం అందిస్తాడు.
8. ర్యాన్ రికెల్టన్ (దక్షిణాఫ్రికా)
ర్యాన్ రికెల్టన్ దక్షిణాఫ్రికా భవిష్యత్తు ప్రధాన వికెట్ కీపర్‌గా ఎదుగుతున్నాడు. గ్లోవ్ వర్క్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు. డి కాక్ వారసుడిగా అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
9. టిమ్ సైఫర్ట్ (న్యూజిలాండ్)
సైఫర్ట్ ఒక అథ్లెటిక్ వికెట్ కీపర్ అని చెప్పవచ్చు. అతను వికెట్ల వెనుక వేగంగా కదలడంతో పాటు టీ20ల్లో వేగంగా రన్స్ చేయగల ఆటగాడు. జట్టు ఒత్తిడి సమయంలో కూడా మంచి ప్రభావం చూపగల ప్లేయర్.
10. జోష్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ గ్లోవ్ వర్క్ క్రమంగా మెరుగుపడుతూ ఉంది. టెస్టు డెబ్యూ లోనే సెంచరీ సాధించి తన బ్యాటింగ్ ప్రతిభ చూపించాడు.