MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • Sourav Ganguly: బెంగాల్ దాదాకు మరో కీలక పదవి.. ఈసారి ఏకంగా ఐసీసీ లోనే.. నెక్స్ట్ అదేనా..?

Sourav Ganguly: బెంగాల్ దాదాకు మరో కీలక పదవి.. ఈసారి ఏకంగా ఐసీసీ లోనే.. నెక్స్ట్ అదేనా..?

ICC Cricket committee Chairman: ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంగూలీ.. ఇప్పుడు ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఇక తర్వాత గంగూలీ చూపు ఆ పదవిపైనే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 17 2021, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీకి మరో కీలక పదవి దక్కింది. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. త్వరలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఇన్నాళ్లు ఆ పదవిలో కొనసాగిన టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియడంతో అతడి స్థానంలో గంగూలీ నియమితుడయ్యాడు. ఈ మేరకు ఐసీసీ గవర్నింగ్ బాడీ  బుధవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

39

ఐసీసీ వివరాల ప్రకారం.. 2012 నుంచి క్రికెట్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుంబ్లే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వరుసగా మూడేండ్ల పాటు కుంబ్లే ఆ పదవిలో కొనసాగాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం మూడు పర్యాయాల (ఒక్కోటి మూడేండ్లు) కంటే ఎక్కువ కాలం కొనసాగకూడదు. దీంతో కుంబ్లే ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. 

49

ఈ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే మాట్లాడుతూ.. ‘ఐసీసీ  పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీ బాధ్యతలు చేపట్టడాన్ని ఆహ్వానిస్తున్నాం. అంతర్జాతీయ మేటి క్రికెటర్లలో ఒకడైన గంగూలీ సేవలను మేం ఉపయోగించుకుంటాం.. 

59

ఆటగాడిగానే గాక అడ్మినిస్ట్రేటర్ గా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా మాకు కలిసొస్తుంది..’ అని తెలిపాడు. 

69

కాగా.. ఈ పదవి నుంచి దిగిపోతున్న కుంబ్లే పై గ్రెగ్ ప్రశంసలు కురిపించాడు. ‘అనిల్ ఇన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలను పెంచడానికి కృషి చేశాడు. ఈ పదవిలో అతడు చేసిన సేవలు మరువలేనివి. డీఆర్ఎస్ విధానం సక్రమంగా అమలయ్యేలా చూడటం.. అనుమానాస్పద బౌలింగ్ శైలిలపై నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలపై కుంబ్లే కీలకంగా వ్యవహరించాడు..’ అని ఆయన పేర్కొన్నాడు. 

79

2012లో ఈ పదవి చేపట్టిన కుంబ్లే.. 2016, 2019 లలో కూడా ఎంపికయ్యాడు. అంతకుముందు ఈ పదవిలో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ ఉండేవాడు. కాగా.. ఇప్పటికే ఐసీసీ టెక్నికల్ కమిటీలో పరిశీలకుడిగా ఉన్న గంగూలీ కి ఇది పదోన్నతే. 

89

ఇదిలాఉండగా.. అఫ్గానిస్థాన్ లో క్రికెట్  స్థితిని సమీక్షించడానికి ఐసీసీ బుధవారం ఒక  వర్కింగ్ గ్రూప్ ను నియమించింది. ఈ వర్కింగ్   గ్రూప్ ఇమ్రాన్ ఖవాజా (చైర్మన్), రాస్ మెక్కల్లమ్, లాసన్ నయిడో, రమీజ్ రాజా సభ్యులుగా ఉన్నారు. రాబోయే కొద్దిరోజుల్లో ఈ కమిటీ అఫ్గాన్ లో క్రికెట్ పరిస్థితులు, ఇతర విషయాల మీద సమగ్ర రిపోర్డును దాఖలు చేయనుంది.

99

కాగా.. ఇప్పటికే  ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంగూలీ.. ఇప్పుడు ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఇక తర్వాత గంగూలీ చూపు ఐసీసీ అధ్యక్ష పదవిపైనే అని వాదనలు వినిపిస్తున్నాయి. పేరుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అయినా అది బీసీసీఐ కనుసన్నల్లోనే నడుస్తుందనేది బహిరంగ రహస్యమే. అయితే ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా బీసీసీఐ బాస్ ఐసీసీ బాస్ కావడమనేది  పెద్ద విషయమేమీ కాదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved