- Home
- Sports
- Cricket
- మనకి బజ్‌బాల్ కాన్సెప్ట్ సెట్ కాదు! రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయితే అంతే!... అశ్విన్ షాకింగ్ కామెంట్స్
మనకి బజ్‌బాల్ కాన్సెప్ట్ సెట్ కాదు! రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయితే అంతే!... అశ్విన్ షాకింగ్ కామెంట్స్
ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, టెస్టు కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ బాధ్యతలు తీసుకున్నాక బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో టెస్టులు ఆడే విధానాన్నే పూర్తిగా మార్చేశారు. దూకుడే మంత్రంగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌ని 78 ఓవర్లకే డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్, యాషెస్ సిరీస్ గెలిచే అద్భుత అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది..

Ben Stokes
మొదటి రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్, 2-2 తేడాతో యాషెస్ సిరీస్‌ని డ్రా చేయగలిగింది. వర్షం కారణంగా నాలుగో టెస్టు ఫలితం తేలకుండా డ్రా అయ్యింది కానీ లేకుండా ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఈజీగా గెలిచి ఉండేది..
Ashwin
యాషెస్ సిరీస్ తర్వాత వచ్చే ఏడాది మార్చిలో ఇండియాతోనే టెస్టు సిరీస్ ఆడనుంది ఇంగ్లాండ్ జట్టు. మరి ఇంగ్లాండ్‌ని ఎదుర్కోవడానికి టీమిండియా ఏం చేస్తుంది? బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తుందా? ఈ విషయంపై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు రవిచంద్రన్ అశ్విన్..
‘ఒకవేళ టీమిండియా బజ్‌బాల్ కాన్సెప్ట్‌ని అలవర్చుకుందనే అనుకుందాం. హారీ బ్రూక్ ఆడినట్టుగా ఎవరైనా భారత ప్లేయర్, స్పీడ్‌గా ఆడబోయి అవుట్ అయితే... మనం ఇంగ్లాండ్ ఓడినట్టు రెండు టెస్టుల్లో ఓడితే ఏం చేస్తాం?
Ashwin
వెంటనే బజ్‌బాల్ లేదు! తొక్కా లేదు.. అని రెండు టెస్టుల్లో దూకుడుగా ఆడబోయి వికెట్ పారేసుకున్న ప్లేయర్లను టీమ్‌లో నుంచి తప్పిస్తాం.. మన క్రికెట్ సంస్కృతి అలా ఉంటుంది..
టీమిండియా, వేరే టీమ్ కల్చర్‌ని అలవర్చుకోలేదు. ఇంగ్లాండ్ టీమ్‌కి వర్కవుట్ అయినట్టుగా టీమిండియాకి బజ్‌బాల్ సెట్ కాదు. ఇంగ్లాండ్ బోర్డు, మేనేజ్‌మెంట్‌కి ప్లేయర్లపై పూర్తి నమ్మకం ఉంటుంది. వాళ్లు ఒకటి రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయినా తర్వాతి మ్యాచుల్లో వాళ్లకు చోటు ఉంటుంది..
Harry Brook
అంతెందుకు మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత కూడా ఇంగ్లాండ్‌కి ఫ్యాన్స్ సపోర్ట్ ఫుల్లుగా దక్కింది. బజ్‌బాల్ కాన్సెప్ట్‌ని వాళ్లు బాగా ఆదరిస్తున్నారు. మన దగ్గర అలా జరగదు. రెండు మ్యాచుల్లో ఓడిపోతే, కెప్టెన్‌ని మార్చాలి? కోచ్‌ని మార్చాలని డిమాండ్లు వస్తాయి... ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్..