మీ లాస్ మేం పూరిస్తాం! ఐపీఎల్ ఆడనందుకు ఆ ముగ్గురికీ బోనస్ ఇచ్చిన బంగ్లాదేశ్...
టీమిండియాకి ఆడకపోయినా పర్లేదు, ఐపీఎల్‌లో మాత్రం కచ్చితంగా ఆడాల్సిందేనని అనుకుంటారు చాలామంది భారత క్రికెటర్లు. గత ఏడాది రెస్ట్ పేరుతో సగం మ్యాచులకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో అలిసిపోకుండా అన్నీ మ్యాచులు ఆడాడు...

shakib
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరంగా ఉన్నారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. ఇదే సమయంలో వేలంలో అమ్ముడుపోయిన ముగ్గురు బంగ్లా క్రికెటర్లు కూడా ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరంగా ఉన్నారు..
Shakib Al Hasan
ఐపీఎల్ 2023 మినీ వేలంలో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ని బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. అయితే ఐర్లాండ్‌తో సిరీస్ కారణంగా షకీబ్ అల్ హసన్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడలేదు..
Liton Das
అలాగే రూ.50 లక్షలకు అమ్ముడుపోయిన బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ కూడా ఐపీఎల్ 2023 సీజన్‌లో పాల్గొనలేదు. వీరితో పాటు మార్క్ వుడ్ ప్లేస్‌లో ఆడించాలనుకున్న టస్కిన్ అహ్మద్‌కి కూడా బంగ్లా బోర్డు నుంచి ఎన్‌వోసీ దక్కలేదు..
Taskin Ahmed
ఐపీఎల్ ఆడకుండా బంగ్లాదేశ్ టీమ్‌కి ఆడినందుకు వీరికి నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధమైంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఈ ముగ్గురికీ కలిపి 65 వేల డాలర్లు (దాదాపు 53 లక్షలు) పరిహారంగా చెల్లించనుంది బీసీబీ...
Mustafizur Rahman
బంగ్లాదేశ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఒక్కడే, బంగ్లా నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ఆడాడు. గత సీజన్‌లో 8 మ్యాచులు ఆడి 8 వికెట్లు తీసిన ముస్తాఫిజుర్ రహ్మాన్, ఈసారి 2 మ్యాచులు ఆడి ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు..
ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఈ విధంగా ఐపీఎల్‌కి దూరంగా ఉన్నందుకు నష్టపరిహారం చెల్లించాలని కోరితే, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకి కోట్ల రూపాయల్లో ఖజానాకి చిల్లు పడుతుంది. ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వంటి ఆసీస్ ప్లేయర్లకు ఐపీఎల్‌లో మంచి డిమాండ్ ఉంది..